బిజినెస్

స్వల్పంగా లాభపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఊగిసలాట మధ్య సాగిన లావాదేవీలలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 60 పాయింట్లు పుంజుకొని, 33,940.44 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 14.90 పాయింట్లు పెరిగి, 10,417.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకుంటుందని, ఆసియాలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుదొక్కుకుంటుందని ఏడీబీ వెలువరించిన అంచనా మదుపరులకు ప్రోత్సాహం ఇచ్చింది. అమెరికా, చైనాలు తమ మధ్య వాణిజ్య పోరుపై కాస్త మెత్తబడటం కూడా స్టాక్ మార్కెట్లకు సానుకూలాంశంగా మారింది. దేశీయ మార్కెట్ కీలక సూచీలు పుంజుకోవడం ఇది వరుసగా అయిదో సెషన్. దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) తగిన స్థాయిలో కొనుగోళ్లకు పూనుకోవడంతో పాటు అమెరికా మార్కెట్ల పెరుగుదల కారణంగా ఆసియా మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ ధోరణి దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు సానుకూలంగా ముగియడానికి దోహదపడింది. మదుపరులు గురువారం వెలువడనున్న చిల్లర ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి వంటి స్థూలార్థిక గణాంకాలు, శుక్రవారం నుంచి వెలువడనున్న కార్పొరేట్ కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలపై దృష్టి కేంద్రీకరించారని బ్రోకర్లు చెప్పారు.
బుధవారం అధిక స్థాయి వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ తరువాత మరింత పుంజుకొని, ఇంట్రా-డేలో 33,981.54 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో 33,750.74 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 60.19 పాయింట్ల (0.18 శాతం) లాభంతో 33,940.44 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం నాలుగు సెషన్లలో కలిసి 861.18 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 10,428.15- 10,355.60 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 14.90 పాయింట్ల (0.14 శాతం) లాభంతో 10,417.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇదిలా ఉండగా, మంగళవారంనాటి లావాదేవీల్లో డీఐఐలు నికరంగా రూ. 653.65 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 684.99 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
ఇదిలా ఉండగా, బుధవారంనాటి లావాదేవీల్లో సెనె్సక్స్ ప్యాక్‌లోని టీసీఎస్ అత్యధికంగా 2.85 శాతం లాభపడింది. సన్ ఫార్మా 2.50 శాతం లాభంతో తరువాత స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థల్లో హెచ్‌యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎంఅండ్‌ఎం, కోటక్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతి సుజుకి ఉన్నాయి. మరోవైపు, అదాని పోర్ట్స్, ఎస్‌బీఐ, యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ నష్టపోయిన సంస్థల్లో ఉన్నాయి.