బిజినెస్

ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి 7.1 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఫిబ్రవరి నెలలో పారిశ్రామిక ఉత్పత్తి రేటు 7.1 శాతంగా నమోదైంది. వరుసగా నాలుగోనెల కూడా అధిక పారిశ్రామికోత్పత్తి నమోదు కావడం గమనార్హం. ఈ కాలంలో తయారీరంగం అద్భుతమైన పనితీరు ప్రదర్శించడం, మూలధన వస్తువులు, వినియోగ వస్తువుల కొనుగోళ్లు పెరగడం ఇందుకు ప్రధాన కారణం. పారిశ్రామిక ఉత్పత్తి సూచి (ఐఐపీ) ప్రకారం, ఫిబ్రవరి నెలలో కర్మాగారాల్లో ఉత్పత్తి 1.2 శాతం పెరిగింది. గత నవంబర్‌లో ఐపీపీ రికార్డు స్థాయికి అంటే 8.54 శాతానికి పెరగ్గా, డిసెంబర్‌లో 7.1 శాతం, జనవరిలో 7.4 శాతం నమోదైంది. ఏప్రిల్-్ఫబ్రవరి మధ్యకాలంలో ఐపీపీ 4.3శాతం వృద్ధిని నమోదు చేయగా, అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 4.7 శాతం నమోదైంది. సూచికలో 77 శాతం తయారీ రంగానిదే. కాగా ఈ రంగం ఫిబ్రవరిలో 8.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 0.7 శాతం పెరుగుదల నమోదైంది. అదేవిధంగా మూలధన వస్తువుల ఉత్పత్తి గతంలో నమోదైన 2.4 శాతంతో పోలిస్తే 20శాతం పెరిగింది. అదేవిధంగా వినియోగ వస్తువుల కొనుగోళ్లు, 2017 ఫిబ్రవరిలో 4.6 శాతం ఉండగా, 2018, ఫిబ్రవరిలో అవి 7.9 శాతానికి పెరిగాయి. అయితే మైనింగ్ రంగం వృద్ధి 0.3 శాతం పడిపోవడం గమనార్హం. అంతకుముందు ఏడాది ఈ రంగం వృద్ధి 4.6 శాతంగా నమోదైంది. ఇక కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ 7.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కాగా తయారీ రంగానికి చెందిన మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 15 సానుకూల వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.