బిజినెస్

తగ్గిన చిల్లర ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలను నమోదు చేసింది. ఫిబ్రవరిలో 4.44 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, మార్చిలో 4.28 శాతానికి తగ్గింది. కాగా వినియోగవస్తువుల ధరల సూచి (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత ఐదునెలల కనిష్ఠానికి చేరుకోవడం గమనార్హం. కాగా గత డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల్లో గరిష్ఠస్థాయికి ఎగసింది. ఇక ఆహార ద్రవ్యోల్బణం మార్చినెలలో 0.44 రుణాత్మక వృద్ధిని నమోదు చేసింది. వినియోగదారుల ధరల సూచి మార్చిలో ఇంకా తగ్గి 4.20 శాతానికి చేరుకోవచ్చునని రాయ్‌టర్స్ వార్తాసంస్థ అంచనా వేసింది. కాగా రాబోయే నెలల్లో ద్రవ్యోల్మణం కొద్దిగా పెరిగే అవకావమున్నదని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్రం గ్రామీణ సంక్షేమంపై దృష్టి కేంద్రీకరించి, వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను ప్రకటించింది. ఇది ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు.
ఇదిలావుండగా 2018లో వినియోగదారుల ధరల సూచి ఏప్రిల్ నుంచి పైకి ఎగసే అవకాశముందని ఆర్థికవేత్త తెరెస్సా జాన్ పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంకు మధ్యంతర ద్రవ్యోల్బణ లక్ష్యం 4.0గా నిర్ణయించింది. కానీ దీనికంటే ఎక్కువ నమోదు కావడంతో, సెంట్రల్ బ్యాంకు గతవారం రెపోరేటును యథాతథంగా ఉంచింది.