బిజినెస్

ఐడీబీఐకి రూ.3 కోట్ల జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 12: ఐడీబీఐ బ్యాంకుకు, రిజర్వ్ బ్యాంకు రూ.3 కోట్ల జరిమానా విధించింది. తాను నిర్దేశించిన మార్గదర్శక సూత్రాకనుగుణంగా చెడ్డ రుణాలకు సంబంధించిన నివేదికను సమర్పించలేదన్న కారణంగా ఐడీబీఐపై ఈ చర్య తీసుకున్నట్టు రిజర్వ్ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా బ్యాంకు తన కస్టమర్లతో నిర్వహించిన లావాదేవీలకు సంబంధించి ఈ చర్య తీసుకోలేదని, కేవలం నిబంధనల మేరకు నివేదిక సమర్పించలేదన్న కారణంగానే జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
2016 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.6,186 కోట్లు చెడ్డ రుణాలుగా ఐడీబీఐ పేర్కొంది. వీటిని ఆర్‌బీఐ కూడా గుర్తించింది. బ్యాంకు తన నివేదికలో పేర్కొన్న డిఫాల్టర్ల కంటే, ఆర్‌బీఐ 15 శాతం కంటే అధిక డిఫాల్టర్లను కనుగొన్నట్లయితే, సదరు బ్యాంకు వాటిని బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఐడీబీఐ ఇచ్చిన రుణాల్లో నాలుగోవంతు రుణాలు వసూలు కావడంలేదు. దీంతో సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్‌బీఐ ఇప్పటికే ఐడీబీఐని హెచ్చరించింది. చెడ్డరుణాల విషయంలో ఆర్‌బీఐ జరిమానా విధించిన తాజా సంఘటన ఇది. 2016 సంవత్సరానికి సంబంధించి చెడ్డ రుణాల విషయంలోగతంలో యాక్సిస్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంకు జరిమానా విధించింది. గత అక్టోబర్‌లో ఎస్‌బ్యాంకుకు కూడా జరిమానా విధించింది.