బిజినెస్

దేశీయ మార్కెట్‌లోకి థామ్సన్ స్మార్ట్ టీవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ప్రముఖ ఫ్రెంచ్ టెలివిజన్ల తయారీ సంస్థ థామ్సన్ దేశీయ మార్కెట్‌లోకి పునఃప్రవేశించింది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం థామ్సన్ కంపెనీ తక్కువ ధరలకే అద్భుత ఫీచర్లతో మూడు సైజుల స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ టెలివిజన్‌లు కేవలం ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్ కార్డు ద్వారా నేటి నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. థామ్సన్ దేశీయ కంపెనీ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌పీపీఎల్) సంయుక్తంగా మన దేశంలోని మూడు యూనిట్లలో ఈ టీవీలను తయారు చేస్తున్నాయి. అదిరే ఫీచర్లతో బీ-9 సీరీస్‌లో 32 అంగుళాల స్మార్ట్ టీవీని కేవలం 13,490 రూపాయలకు, 40 అంగుళాల స్మార్ట్‌టీవీ కేవలం 19,990 రూపాయలకు, అలాగే యూడీ-9 సీరీస్‌లో 43 అంగుళాల స్మార్ట్ టీవీనీ కేవలం 27,999 రూపాయలకు విక్రయించనున్నట్లు తెలిపారు. ఎస్‌పీపీఎస్ సంస్థ సీఈఓ అవనీత్‌సింగ్ మార్వ మాట్లాడుతూ దేశీయ స్మార్ట్ టీవీల మార్కెట్‌లో ఈ స్మార్ట్ టీవీలు సంచలనాన్ని సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ కంపెనీ థామ్సన్ సంస్థతో కలిసి పనిచేయడం చాల సంతోషంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్‌లో హవా ఛలాయిస్తున్న ప్రముఖ టీవీ కంపెనీలకు తమ సంస్థ గట్టిపోటీని ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.