బిజినెస్

భారత ఎగుమతుల్లో ఆశాజనక వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: నాలుగు నెలల వ్యవధి తర్వాత మార్చి నెలలో భారత్ ఎగుమతులు పడిపోయినప్పటికీ, 2017-18 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 9.78 శాతం పెరుగుదల నమోదు చేసి, 302.84 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే మార్చి నెలలో ఎగుమతులు 0.66 శాతం పడిపోవడానికి ప్రధాన కారణం కొన్ని రంగాలకు చెందిన ముఖ్యంగా పెట్రోలియం, రత్నాలు, ఆభరణాల ఉత్పత్తులు తగ్గిపోవడమే. అంతకుముందు 2017, అక్టోబర్‌లో దిగుమతులు 1.12 శాతం పడిపోయాయి. ఇదేనెలలో దిగుమతులు 7.15 శాతం పెరిగి 42.8 బిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయికి చేరుకోవడంతో, వాణిజ్య లోటు 13.68 బిలియన్ డాలర్లుగా నమోదైనట్టు, శుక్రవారం వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన సమాచారం వెల్లడిస్తోంది.
2017-18 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 19.59 శాతం పెరిగి 459.67 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో వాణిజ్యలోటు మరింతగా పెరిగి 156.83 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకుంది. ఇదిలావుండగా రెండు ఆర్థిక సంవత్సరాల తర్వాత 2017-18లో వాణిజ్య ఎగుమతులు 300 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. 2014-15లో ఈ మొత్తం 310.30 యుఎస్‌డిలుగా నమోదైంది. ఇక వాణిజ్యలోటు విషయానికి వస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఇది 156.83 బిలియన్ డాలర్లు నమోదైంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 190.30 బిలియన్ డాలర్ల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో వాణిజ్యలోటు ఏర్పడటం ఇదే ప్రథమం.
శ్రామిక శక్తి అధికంగా అవసరమైన ఆభరణాలు, టెక్స్‌టైల్స్, జ్యూట్, వ్యవసాయ ఉత్పత్తుల రంగంలో ఎగుమతుల విషయంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఈఓ) ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు తమ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేయడంతో, ఈ రంగాలు లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయని సంస్థ విడుదల చేసిన ప్రకటన తెలియజేసింది.
‘‘ప్రపంచ ఆర్థిక సంస్థ, 2018లో అంతర్జాతీయ వర్తకం 4.4 శాతం ఉండబోతున్నదని, 2019లో 4శాతం వరకు ఉంటుందని అంచనా వేసిన నేపథ్యంలో, ఎగుమతుల విషయంలో వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు కొనసాగే అవకాశమున్నదని’’ ఎఫ్‌ఐఈఓ ప్రకటన పేర్కొంది.
ఇక ఈ నెలలో చమురు దిగుమతులు 11.11 బిలియన్ యుఎస్ డాలర్లుగా ఉండవచ్చు. ఇది గత ఏడాది ఇదే నెలలో జరిగిన ఎగుమతులకంటే 13.92 శాతం అదనం. ఇక చమురేతర దిగుమతులు 4.96 శాతం అధికంగా, 31.69 బిలియన్ యుఎస్ డాలర్లు నమోదు చేశాయి. 2017-18లో చమురు దిగుమతులు 25.47 శాతం అంటే 109.11 మిలియన్ యుఎస్ డాలర్లు నమోదయ్యాయి. ఇక బంగారం దిగుమతులు 40 శాతం పడిపోయి 2.49 మిలియన్ యుఎస్ డాలర్లుగా నమోదయ్యాయి.