బిజినెస్

తొలి త్రైమాసికంలో పెరిగిన స్వాధీనాలు, విలీనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: భారత కార్పొరేట్ రంగం మార్చి నెలలో 1.5 బిలియన్ డాలర్ల మేర విలీనాలు, స్వాధీనాలు చేపట్టాయని ఒక నివేదిక వెల్లడించింది. దీంతో 2018 తొలి త్రైమాసికంలో మొత్తం చోటుచేసుకున్న డీల్‌లు 18.58 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకున్నాయని నివేదిక వెల్లడించింది. అస్యూరెన్స్, టాక్స్ అండ్ అడ్వైజరీ సంస్థ గ్రాంట్ ధోరన్‌టన్ ప్రకారం మార్చిలో చోటుచేసుకున్న 31 విలీనాలు, స్వాధీనాల మొత్తం విలువ 1,499 మిలియన్ అమెరికన్ డాలర్లు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే కాలం విలువతో పోలిస్తే 92 శాతం తక్కువ. గత ఏడాది మార్చి నెలలో ఈ డీల్‌ల మొత్తం విలువ 23,822 మిలియన్ యుఎస్ డాలర్లు. మొత్తం 28 లావాదేవీల్లో, ఈ ఒప్పందాలు జరిగాయి.
జనవరి-మార్చి మధ్యకాలంలో జరిగిన 118 లావాదేవీలు మొత్తం విలువ 18,529 మిలియన్ యుఎస్ డాలర్లు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 105 విలీనాలకు సంబంధించిన డీల్స్ జరగ్గా వీటి విలువ 27,477 యుఎస్ డాలర్లు.
2017 తొలి త్రైమాసికంలో 23 బిలియన్ డాలర్లు వోడాఫోన్-ఐడియా విలీనాన్ని మినహాయిస్తే, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో డీల్స్ విలువ 2.3 శాతం అధికం నమోదయ్యాయి. ఇదే కాలంలో దేశీయ విలీనాలు, స్వాధీనాలు ఏకంగా 5.3 శాతం అధికంగా నమోదయ్యాయి. ఇవి మొత్తం విలీనాలు, స్వాధీనాల విలువలో 67 శాతం. ఇక సీమాంతర డీల్ కార్యకలాపాలు 2017, జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే 85 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.