బిజినెస్

ఎఫ్‌పీఐ పెట్టుబడి పరిమితిని పెంచిన సెబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13 : భారతీయ మూలధన మార్కెట్లలోకి, విదేశీ పెట్టుబడి ప్రవాహాలను పెంచేందుకు వీలుగా, కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లలోవిదేశీ పోర్ట్‌పోలియో నిధుల (ఎఫ్‌పిఐ) పెట్టుబడి పరిధిని పెంచాలని సెబీ నిర్ణయించింది. ఈ పరిధిని మొత్తం రెండు విడతల్లో అంటే ఏప్రిల్ 12, అక్టోబర్ 1 తేదిలనుంచి ఈ విస్తరించాల్సి ఉంటుంది. దేశీయ మూలధన మార్కెట్‌లోకి విదేశీ నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా ఏప్రిల్ 12 నాటికి ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎఫ్‌పీఐ పరిమితిని రూ.2,07,300 కోట్లకు, అక్టోబర్ 1నాటికి 2,23,300 కోట్లకు పెంచినట్టు సెబీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అంతకుముందు విదేశీ పోర్టుపోలియో పెట్టుబడుల పరిమితి రూ.1,89,700 కోట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెరిగిన దీర్ఘకాలిక ఎఫ్‌పీఐల పరిమితి రూ.78,700, గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. అక్టోబరు 1 నుంచి, రూ.92,300 కోట్ల మేర పెరుగుదల అమల్లోకి వస్తుంది. అంతకు ముందు దీర్ఘకాలిక ఎప్‌పిఐలకు ఈ పరిమిది రూ.44,100 కోట్లుగా ఉండేది.
ఇదిలావుండగా కార్పొరేట్ రుణ పెట్టుబడి పరిమితి రూ.2,66,700 కోట్లకు పెరిగింది. ఇది గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఇది 2,89,100 కోట్లకు పెరగనుంది. అయితే ప్రస్తుతం దీని పరిమితి 2,44,323 కోట్లుగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి రుణాలు రూ.34,800 కోట్లకు పెరిగాయి. ఇవి ఇంకా రూ.38,100 కోట్లకు పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వీటి పరిమితి ర.31,500 కోట్లు.