బిజినెస్

సింగరేణి సీఎండీకి ఆసియా పసిఫిక్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: సింగరేణి సంస్థను అత్యుత్తమ కంపెనీగా తీర్చిదిద్దినందుకు ఆ సంస్థ చైర్మన్, సిఎండి ఎన్ శ్రీ్ధర్‌కు ప్రతిష్టాత్మక ఆసియా పసిఫిక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్-2018 అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగినకార్యక్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వికెసింగ్ చేతుల మీదుగా ఈ అవార్డును ఎన్ శ్రీ్ధర్ స్వీకరించారు. అత్యుత్తమ పనితీరు, అంకితభావం, ప్రతిభావంతమైన నాయకత్వంతో సింగరేణి సంస్థను జాతీయ స్థాయిలో అగ్ర స్థాయిలో నిలిపినందుకు ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఈ అవార్డును సింగరేణి సంస్థ సిఎండి ఎన్ శ్రీ్ధర్‌కు ప్రకటించంది. ఈ సందర్భంగా సిఎండి శ్రీ్ధర్ మాట్లాడుతూ, 2015-16లో 15 శాతం వృద్ధిరేటును నమోదు చేసినట్లు చెప్పారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్ధ కూడా ఈ మేర వృద్ధిరేటును సాధించలేదన్నారు. ఇదే ఒరవడితో 2016-17, 2017-18లో కూడా బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా, లాభాల్లో కొత్త రికార్డులను నెలకొల్పినట్లు చెప్పారు. తమమ సంస్థ గత ఏడాది రూ. 1200కోట్ల లాభాలు, 27.8 శాతం వృద్ధితో రూ.22,667 కోట్ల టర్నోవర్‌ను సాధించి సరికొత్త రికార్డులను నెలకొల్పినట్లు చెప్పారు. సింగరేణి విద్యుత్ సంస్థ జాతీయ స్థాయిలో అత్యధిక పిఎల్‌ఎఫ్‌ను సాధించి ఐదవ స్థానంలోనిలిచిందన్నారు. కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, వివిధ కార్మిక సంఘాల కృషి వల్ల సింగరేణికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ ఎస్ శంకర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి కిషన్ రావ్, రెసిడెంట్ ఆఫీసర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.