బిజినెస్

మూడో వారమూ లాభాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 14: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో వారం లాభపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో 565.68 పాయింట్లు పుంజుకొని, 34,192.65 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కీలకమయిన 10,400 స్థాయికి పైన 10,480.60 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ప్రపంచ పరిణామాలలో ఎడతెరిపి లేని అనిశ్చితి వంటి ప్రతికూల పరిణామాలు నెలకొన్నప్పటికీ ఈ వారంలో మదుపరులు ఉత్సాహంగా లావాదేవీలలో పాల్గొనడం వల్ల కీలక సూచీలు వారమంతా ఓ మోస్తరు లాభాలు గడిస్తూ వచ్చాయి. గత సంవత్సర కాలంలో ఇలా వారమంతా కీలక సూచీలు పుంజుకోవడం ఇది రెండోసారి. చైనా తన ఆర్థిక వ్యవస్థలోకి మార్గాలను మరింత తెరవడానికి నిర్ణయించడంతో అమెరికాతో నెలకొన్న వాణిజ్య పోరు ఉద్రిక్తతలు ఈ వారంలో కాస్త తగ్గాయి. దీనికి తోడు పటిష్టమయిన దేశీయ మార్కెట్ పునాదులు మదుపరుల సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల, సిరియా అంశంపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, వీటి ప్రతికూల ప్రభావం మార్కెట్ సెంటిమెంట్‌పై చాలా తక్కువగానే పడింది. ఈ వారంలో వెలువడిన స్థూలార్థిక గణాంకాలు మరింత బలపడిన పారిశ్రామిక ఉత్పత్తి, తగ్గిన చిల్లర ద్రవ్యోల్బణాన్ని సూచించాయి. ఈ సానుకూల అంశాలు మార్కెట్ ఫండమెంటల్స్‌ను మరింత బలోపేతం చేశాయి.
ఫిబ్రవరి నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 7.1 శాతం పుంజుకోగా, వినియోగవస్తువుల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం మార్చి నెలలో 4.28 శాతానికి తగ్గింది. ఫిబ్రవరిలో చిల్లర ద్రవ్యోల్బణం 4.44 శాతం ఉండింది. వీటికి తోడు 2017-18 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయన్న మదుపరుల అంచనాలు మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి. సెనె్సక్స్ ఈ వారంలో 33,653.61 పాయింట్ల వద్ద ప్రారంభమయి, 34,313.14 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 33,578.91 పాయింట్ల కనిష్ట స్థాయి మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 565.68 పాయింట్లు (1.68 శాతం) పుంజుకొని, 34,192.65 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం వారంలో 1,030.43 పాయింట్లు (3.16 శాతం) పుంజుకుంది. నిఫ్టీ ఈ వారంలో 10,333.70 పాయింట్ల వద్ద ప్రారంభమయి, 10,519.90- 10,328.50 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 149.00 పాయింట్లు (1.44 శాతం) పుంజుకొని, 10,480.60 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ), స్థిరాస్తి, లోహ, టెక్నాలజి, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకులు, ఐపీఓలు, ఎఫ్‌ఎంసీజీ, పవర్, వాహన రంగాల షేర్లకు ఈ వారంలో ఎక్కువగా కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు, చమురు- సహజ వాయువు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ రంగాల షేర్లు మదుపరుల లాభాల స్వీకరణ కారణంగా నష్టపోయాయి. ఇదిలా ఉండగా, ఈ వారంలో ఫారిన్ పోర్ట్ఫోలియె ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) కలిసి నికరంగా రూ. 1,487.82 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.