బిజినెస్

ఎయిర్ కార్గోకు మహర్దశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, ఏప్రిల్ 14: విమానాల ద్వారా సరుకు రవాణా (ఎయిర్ కార్గోను) మరింత పెంపొందించడానికి త్వరలోనే ఒక విధానాన్ని రూపొందించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. ఉత్తర గోవాలోని మోపాలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతిని సమీక్షించేందుకు మంత్రి ఇక్కడికి వచ్చారు. జీఎంఆర్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. ఈ విమానాశ్రయ నిర్మాణం మొదటి దశ 2020 నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సురేశ్ ప్రభు శనివారం ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ ఎయిర్ కార్గోకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, ఈ విధానం వల్ల విమానయాన మార్కెట్ మరింత వృద్ధి పొందుతుందని అన్నారు. దేశంలో ప్రైవేటు విమానయాన సంస్థలు చురుగ్గా పాల్గొనడం ద్వారానే విమానయాన రంగం విజయవంతం అయిందని ఆయన పేర్కొన్నారు. ఎయిర్ కార్గోకు అవసరమైన వౌలిక సౌకర్యాలను కూడా ఇదే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. విమానయాన ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో విమానాల ద్వారా సరుకు రవాణాను చేయవచ్చని ఆయన అన్నారు. చెడిపోయే సరుకులను రవాణా చేయడంలో ఎయిర్ కార్గో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పళ్లు, కూరగాయలను ఎగుమతి చేసేందుకు కొన్ని దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు మంత్రి వెల్లడించారు. భారత్ సుమారు 380 మిలియన్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను, 400 మిలియన్ టన్నుల ఉద్యానవన పంటలను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగిందని, అయితే ఇందులో 30 శాతం మేరకు ఉత్పత్తులు మార్కెట్‌కు చేరేలోపే చెడిపోతున్నాయని ఆయన వివరించారు. అందువల్ల చెడిపోతున్న ఈ 30 శాతం సరుకులను సంరక్షించి, ఎగుమతి చేయవలసి ఉందని, దీనివల్ల రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ఇందుకోసం ఎయిర్ కార్గోను ఉపయోగించుకోవడం జరుగుతుందన్నారు.