బిజినెస్

ఎవరేమన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాజన్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. త్వరలోనే ఆయన వారసుడిని ప్రకటిస్తాం.’
- కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
‘రాజన్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం బాధాకరం. ఆ నిర్ణయం నన్ను ఎంతో అసంతృప్తికి గురిచేసింది.’
- మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం
‘్భరత విశ్వసనీయతను, సామర్థ్యాన్ని పెంచిన ఘనత రాజన్‌ది. ఆయన స్థానంలో రాబోయేవారు కూడా ఇలాగే ఉంటారని ఆశిస్తున్నాం.’
- మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర
‘రాజన్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. నిజానికి చాలామంది గవర్నర్ల మాదిరిగానే రాజన్ మరో రెండేళ్లు కొనసాగుతారని అనుకున్నాను.’
- హెచ్‌డిఎఫ్‌సి చైర్మన్ దీపక్ పరేఖ్
‘రాజన్ నిర్ణయం బాధాకరం. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆయన్ను మరికొంత కాలం ఆర్‌బిఐ గవర్నర్‌గా కొనసాగించాల్సిన అవసరముంది.’
- ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి
‘రాజన్ తీసుకున్న నిర్ణయం.. విద్యారంగానికి లాభమైతే, ఆర్‌బిఐకి మాత్రం తీరని నష్టం. ఆర్థిక సుస్థిరత సాధ్యుడు రాజన్.’
- బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా
‘ఇది చాలా దుర్దినం. రాజన్ ఓ గొప్ప ఆర్థికవేత్త. ఆర్‌బిఐ గవర్నర్‌గా ఆయన మరికొంత కాలం సేవలు అందించాల్సిన అవసరం దేశానికి ఉంది.’
- ఇన్ఫోసిస్ బోర్డు సభ్యుడు మోహన్‌దాస్ పాయ్
‘ద్రవ్యోల్బణంపై పోరాడిన యోధుడు. ఆర్థిక బ్రహ్మ, స్వతంత్రుడు, బ్యాంకింగ్ శస్త్ర నిపుణుడు.’
- ఆర్‌పిజి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంక
‘దేశ ఆర్థిక వ్యవస్థకిది తీరని నష్టం. పదవీ విరమణ అనంతరం షికాగోకు రాజన్ వెళ్తుండటం అక్కడి విద్యారంగానికి లాభిస్తుంది.’
- ప్రముఖ బ్యాంకర్ మీరా సన్యాల్
‘ఆర్‌బిఐ గవర్నర్లుగా గతంలో ఎందరు పనిచేసినా, భవిష్యత్తులో ఎందరు వచ్చినా రాజన్ ప్రత్యేకతే వేరు.’
- మాజీ ఆర్థిక ముఖ్య సలహాదారు కౌశిక్ బసు
‘రాజన్ పనితీరు అద్భుతం, ప్రశంసనీయం.’
- ఇన్ఫోసిస్ సిఇఒ విశాల్ సిక్కా