బిజినెస్

మేం ఎవరి పక్షం వహించబోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఏప్రిల్ 15: అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్యపోరులో ఎవరి పక్షం వహించ బోనని భారత్ స్పష్టం చేసింది. ఒకపక్క బీజింగ్‌తో వన్ బెల్ట్ అండ్ రోడ్ (బీఆర్‌ఐ) వివాదం కొనసాగుతున్నప్పటికీ ఈ అంశంపై తటస్థ వైఖరికే ప్రాధాన్యతనివ్వడం గమనార్హం. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్, చైనా నేషనల్ డెవలప్‌మెట్ అండ్ రిఫార్మ్ కమిషన్ (ఎస్‌ఈడీ) ఛైర్మన్ హె లైఫెంగ్‌తో శనివారం చర్చలు జరిపిన సందర్భంగా 3వాణిజ్యపోరు2పై భారత్ వైఖరిని వెల్లడించారు. వీరిద్దరి మధ్య ఐదవ వ్యూహాత్మక ఆర్థిక చర్చలు (ఎస్‌ఈడీ) జరిగాయి. చర్చల సందర్భంగా బీఆర్‌ఐ అంశం కూడా చర్చకు వచ్చింది. భారత్-చైనాల మధ్య వాణిజ్య, ఆర్థిక వ్యవహారాలపై పరస్పరం చర్చించేందుకు ఎస్‌ఈడీ ముఖ్యమైన వేదిక. గత ఏడాది డోక్లాం ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఈచర్చలు నిలిచిపోయినా, ఈ ఏడాది తిరిగి ప్రారంభమయ్యాయి. చర్చల సందర్భంగా భారత్ నుంచి చక్కెర, సోయాబీన్ ఎగుమతులను అనుమతించాలని కుమార్, చైనాను గట్టిగా కోరారు. చైనా ప్రస్తుతం సోయాబీన్‌లను అమెరికానుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. 3మిగిలిన వాటికంటే వ్యవసాయ దిగుమతులపై చైనా విధించే సుంకాలు అధికం. దీని ఫలితంగా భారతీయ వ్యవసాయ ఎగుమతులు దెబ్బతింటున్నాయి2 అని ఎస్‌ఈడీ సమావేశంలో కుమార్ చైనా దృష్టికి తీసుకొచ్చారు. కాగా బీఆర్‌ఐ అంశాన్ని చైనా లేవనెత్తగా, చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం గుండా వెళుతోంది. అది భారత సార్వభౌమాధికారానికి సంబంధించిన సమస్య అయినందువల్ల అందులో రాజీపడే ప్రసక్తే లేదని కుమార్ స్పష్టం చేశారు. అది ఏవిధంగాను సార్వభౌమాధికారానికి, స్వాతంత్య్రానికి ఆటంకం కలిగించదని. ఇది ఏవిధమైన వివాదాలకు తావులేని ప్రాజెక్టు అంటూ, చైనా వివరించడానికి యత్నించింది. అయితే దీనిపై భారత స్పందన విన్న తర్వాత చైనా మిన్నకుండిపోయిందని కుమార్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మయన్మార్ (బీసీఐఎం) కారిడార్ గురించి, ఎస్‌ఈడీ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ కారిడార్ బీఆర్‌ఐలో భాగమని చైనా పేర్కొనగా, ఇది అంతకు ముందు నుంచి ఉన్నదని భారత్ గుర్తు చేసింది. అయితే భారత్ 3ఆసియా త్రైపాక్షిక హైవే2పై ప్రధానంగా దృష్టి పెడుతున్నదని కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం బీసీఐఎం పనులు పురోగతిలో ఉన్నాయి. అయితే రోహింగ్యా శరణార్థుల సమస్య కారణంగా మయన్మార్, బంగ్లాదేశ్‌లు దీనిపై పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు. ఇదిలావుండగా భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానాన్ని చైనా ప్రశంసించడం విశేషం.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో, ప్రస్తుతం అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్యపోరు అంశంపై భారత్ అభిప్రాయం ఏమిటని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కుమార్ సమాధానిమిస్తూ, 3్భరత్ స్వతఃసిద్ధంగా నిబంధనలతో కూడిన బహుపాక్షిక వాణిజ్య క్రమానికి మద్దతిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా-చైనాల మధ్య వాణిజ్యపోరులో భారత్ ఎవరిపక్షమూ వహించదు2 అని స్పష్టం చేశారు. వాణిజ్య వ్యవహారాల్లో భారత్ ఎప్పుడూ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఆయన విలేకర్లకు తెలిపారు. 3మార్కెట్‌లో భారత్ కీలక స్థాయిలో లేదు. మా మార్కెట్ వాటా చాలా స్వల్పం. అందువల్ల మేం నిబంధనలు పాటించేవారమే తప్ప, నిబంధనలు రూపొందించేవారం కాదు2 అన్నారు. జపాన్‌తో కొనసాగిన వాణిజ్యలోటును, అమెరికా 1980లో ఆ దేశంపై ఒత్తిడి తెచ్చిమరీ తగ్గించగలిగిందన్న సంగతిని ఈసందర్భంగా కుమార్ గుర్తు చేశారు. అమెరికా-చైనా వాణిజ్యపోరు, భారత్‌కు లాభదాయకమా? అని విలేకర్లు పశ్నించగా, 3ఏనుగులు పోట్లాడుకుంటే గడ్డి నలిగిపోతుంది, ప్రస్తుతం మేం ఆ గడ్డిలో భాగం. అందువల్ల ఈ పోరాటం మాకు ఇష్టం కానిది2 అని కుమార్ స్పష్టం చేశారు. 3కొన్ని అంశాలపై విభేదాలు కొనసాగుతున్నప్పటికీ, మిగిలిన అంశాల్లో రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడంపైనే రెండు పక్షాలు దృష్టి కేంద్రీకరించాలి2 అని కుమార్ అన్నారు. అయితే భారత్ ప్రతిపాదించిన 3ఇంటర్‌నేషల్ సోలార్ అలయెన్స్2లో చేరేందుకు చైనా ఆసక్తి కనబరచడం ఈ సమావేశంలో ముఖ్యాంశమని కుమార్ వెల్లడించారు.