బిజినెస్

చైనీస్ మార్కెట్లో చిన్న ఎగుమతిథార్లకు, స్టార్టప్‌లకు డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: చైనాలో భారత్‌కు చెందిన స్టార్టప్‌లకు, చిన్న ఎగుమతిదారుల ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, ఈ ఏడాది 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కున్మింగ్ డియాంచ్‌లో అంతర్జాతీయ సదస్సు, ప్రదర్శన జరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (ఫైయో) పేర్కొంది. చైనాకు భారత్ ఎగుమతులలు 53 శాతం పెరిగాయని, వీటి విల్వు 1.24 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇందులో సేంద్రియ రసాయనాలు, జౌళి, గార్నెంట్స్, సిల్కు, ఆహార ఉత్పత్తులు, ఆభరణాలు, సాఫ్ట్‌వేర్, పర్యాటకం, బిల్డింగ్ మెటరీయల్ ఉత్పత్తులు ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. ఈ ఏడాది జూన్ నెలలో జరిగే సదస్సు, ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారు చెన్నైలోని సదరన్ రీజియన్ హెడ్ ఆఫీస్‌ను సంప్రదించాలని ఆ సంస్థ కోరింది. 19 రాష్ట్రాలకు విస్తరించిన జియో లైఫ్ ఉత్పత్తులు
దేశంలోని 19 రాష్ట్రాలకు జియోలైఫ్‌కు చెందిన ప్రత్యేక పోషక పరిశోధన, సేంద్రియ ఎరువుల ఉత్పత్తుల మార్కెట్ విస్తరించినట్లు జియోలైఫ్ అగ్రిటెక్ ఎండతి విందో లహోటి తెలిపారు. పదవ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జోర్డాన్, చైనా, ఆస్ట్రేలియా, కొరియా తదితర 25 దేశాలకు కూడా తమ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నామన్నరు. రైతులకు అధిక దిగుబడులకు అందించడంతో పాటుగా ఆదాయాన్ని వృద్ధి చేసినట్లు ఎప్పారు. సేంద్రియ వ్యవసాయంకోసం సేంద్రియ పోషకాలను అందించే అత్యుత్తమవనరులుగా తమ ఉత్పత్తులు నిలిచినట్లు చెప్పారు. తమ సంస్థ జియోలైఫ్ చారిటబుల్ ట్రస్టును జియో లైఫ్ ఫౌండేషన్ పేరిట ప్రారంభించి మొక్కలను నాటడం, రక్తదాన శిబిరాలను నిర్వహించడం, గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు పుస్తక పంపిణీ, కెరీర్ కౌనె్సలింగ్, సైకిళ్ల పంపిణీ సేవలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆదివారం ఇక్కడ 40 సైకిళ్లను సిద్ధిపేట జిల్లకు చెందిన గ్రామాల ప్రజలకు అందించినట్లు జియోలైఫ్ ఎండి లహోటి తెలిపారు.