బిజినెస్

ప్రతికూల వాతావరణంతో డాలర్ల పంట విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 15: డాలర్ల పంటగా పేరొందిన రొయ్యల సాగు విలవిల్లాడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకో విధంగా ఉంటున్న వాతావరణం ఆక్వా రంగంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. ఇటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీంతో ఆక్వా రైతాంగం హుటాహుటిన పట్టుబడులు చేస్తున్నారు. ఈ వ్యాధుల కారణంగా రూ.కోట్లు నష్టం వాటిల్లితోంది. రాష్ట్రంలోని సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో ఆక్వా ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఒక పక్క మంచుతో కూడిన వాతావరణం, మరోపక్క మండిపోతున్న ఎండలు సాగుకు ప్రతికూలంగా మారాయి. పలుచోట్ల వివిధ రకాల వ్యాధులు విజృంభించడంతో లాభం సంగతి ఎలాగున్నా పెట్టుబడి వస్తే చాలనుకుని అప్పటికప్పుడు రొయ్యలను పట్టుకుని విక్రయించేస్తున్నారు. ఇక చేపల విషయంలో వ్యాధులు వ్యాప్తిచెంది పెట్టుబడి పెరిగి రైతులకు ఆర్థిక భారంగా మారుతోంది. మంచు వల్ల ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతుంటే పగటి ఉష్ణోగ్రతల్లో ఉక్కబోత ఉండి ఆక్సిజన్ శాతం తగ్గిపోతోంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో చెరువులను శుభ్రం చేసుకుని సీడ్ వేసుకుని సీజన్ ప్రారంభిస్తున్నారు. సరిగ్గా మూడు మాసాల వ్యవధిలో ఈ పంట చేతికి వస్తోంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించే విధంగా కనిపించడం లేదు. దీంతో చాలావరకు చెరువుల్లో వైరస్ రావడం వల్ల రొయ్యలు చెరువు అడుగు భాగంలోనే చనిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రొయ్యల్లో ఎక్కువగా వైట్ స్పాట్ సిండ్రోమ్ వ్యాధి వ్యాపిస్తోంది. దీని తర్వాత అధికంగా విబ్రియో వ్యాధి ప్రబలుతోంది. ఈ రెండింటీ వల్ల రొయ్యలు ఎరుపు, గులాబి రంగులోకి మారి తర్వాత చనిపోతాయి. కొన్ని సందర్భాల్లో అయితే రొయ్యలు మృతిచెంది నీటిపై తేలుతూ ఉంటాయి. ఇక చేపల్లో ఎర్ర వ్యాధి వ్యాపిస్తోంది. పగటి వేళ అధిక ఉష్ణోగ్రతలు, రాత్రి వేళ తక్కువ ఉష్ణోగ్రత వల్ల చేపలు చనిపోతాయి.
ఇటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులు తమ పంటలను చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టి నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలానికి చెందిన ఆక్వా రైతులు వాపోతున్నారు. దిక్కులేని పరిస్థితుల్లో అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. క్షణం ఆలస్యమైనా రొయ్యలు చెరువులో చనిపోతున్నాయని అంటున్నారు.
కేటాయింపులతోనే సరి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.386 కోట్లు మత్స్యశాఖకు కేటాయించింది. గత బడ్జెట్‌కు అదనంగా కేవలం రూ.100 కోట్లు మాత్రమే పెంచారు. ఇవి ఆక్వా రంగం అభివృద్ధికి ఎట్టి పరిస్థితుల్లోను సరిపడవు. ఎందుకంటే ప్రతీ ఏడాది ఆక్వా ఉత్పత్తులు ఎగుమతుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.17 వేల కోట్లు విదేశీమారక ద్రవ్యం వస్తుందంటే ఎంత కేటాయింపులు అవసరమో అర్ధం చేసుకోవచ్చు. కనీసం ప్రభుత్వం ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేయడం, ఐస్ తయారీ యూనిట్లు నెలకొల్పడం, ఆక్వా ఉత్పత్తులను కనీసం 18 నుంచి 21 డిగ్రీల వరకు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్‌లు కూడా లేవు. అన్నింటికి తట్టుకుని ఆక్వా ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి రైతు కోట్లాది రూపాయలు అందిస్తున్నాడు.

చిత్రం.... రొయ్యలు