బిజినెస్

రైల్వేస్ ఎగ్జిబిషన్‌లో ద.మ.రైల్వేకు మొదటి బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో దక్షిణ మధ్య రైల్వే మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. 63వ జాతీయ రైల్వే వారోత్సవాల్లో భాగంగా భోపాల్‌లో ఈ నెల 15 నుంచి 17 వరకు ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో ఆకర్షణీయమైన ప్రదర్శన కనబరిచినందుకు గాను ఈ అవార్డు దక్కింది. 16 జోన్లు పాల్గొన్న ఈ ప్రదర్శనలో మొదటి బహుమతి గెలుచుకున్న ద.మ.రైల్వే రూ.50వేల నగదుతోపాటు, ఇంటర్‌నల్ కోచ్ ఫ్యాక్టరీ విభాగంలో సైతం ఉమ్మడిగా రెండవ బహుమతిని గెలుచుకున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.