బిజినెస్

ఫోన్ మార్కెట్‌పై ఫ్లిప్‌కార్ట్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: సెల్‌ఫోన్ల అమ్మకాల్లో గట్టి అభివృద్ధి సాధించినట్టు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. 2020 నాటికి ఈ మార్కెట్‌ను 40 శాతం వరకు ఆక్రమించాలన్నది తమ లక్ష్యమని పేర్కొంది. ఇందుకోసం ‘మొబైల్స్ 40బై 20’ వ్యూహాన్ని అమలు పరుస్తున్నట్టు తెలిపింది. ‘దాదాపుగా భారత్‌లో కొన్న ప్రతి నాలుగు మొబైల్ ఫోన్లలో ఒకటి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొన్నదే. ఈ రంగంలోకొనసాగుతున్న లీడర్‌షిప్‌ను మరింత సుసంఘటితం చేస్తామని’ ఫ్లిప్‌కార్ట్ వీపీ అజయ్ యాదవ్ తెలిపారు. మొబైల్ ఫోన్ రంగంలో ఫ్లిప్‌కార్ట్ 60 శాతం అభివృద్ది సాధించినప్పటికీ, ఇతరరంగాల్లో ఇది కేవలం 14 శాతం మాత్రమే. 2020 నాటికి వంద మిలియన్ల స్మార్ట్ ఫోన్లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునే యత్నంలో భాగంగా, తైవాన్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఏసెస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామన్నారు. ఈ భాగస్వామ్యంలో తొలి స్మార్ట్ఫోన్ ఏప్రిల్ 23న విడుదల కానుంది. భారతీయ మార్కెట్‌కు అనువైన ఉత్పత్తులను చేపట్టాలని రెండు కంపెనీలు నిర్ణయించాయి. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కల్యాణ కృష్ణమూర్తి మాట్లాడుతూ, 2016లో భారతీయ రిటైల్ మార్కెట్ 600 బిలియన్ యుఎస్ డాలర్లుండగా, 2021 నాటికి 950 బిలియన్ డాలర్లకు చేరే అవకాశమున్నదన్నారు. అదేవిధంగా 2016లో 9-10 బిలియన్ యుఎస్ డాలర్లుగా ఉన్న ఈ కామర్స్, 2021 నాటికి 972 బిలియన్లకు చేరనుందని కృష్ణమూర్తి అంచనా వేశారు.