బిజినెస్

తొమ్మిదో రోజూ లాభాలే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా తొమ్మిదో సెషన్ మంగళవారం లాభపడ్డాయి. గత మూడేళ్ల కాలంలో వరుసగా తొమ్మిది సెషన్ల పాటు లాభపడటం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరం రుతుపవనాలు సాధారణ స్థాయిలో ఉంటాయన్న వాతావరణ కేంద్రం అంచనా మదుపరులలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో మంగళవారం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 90 పాయింట్లు పుంజుకుంది. అమెరికా స్టాక్ మార్కెట్ నుంచి లభించిన సానుకూల ధోరణి ప్రభావంతో ఐరోపా మార్కెట్లు అధిక స్థాయిల వద్ద ప్రారంభమయ్యాయి. దీంతో పాటు ఇతర ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల ప్రభావం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు బలపడటానికి దోహదపడింది. సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీలు 2014 సెప్టెంబర్ నుంచి ఇన్ని సెషన్ల పాటు పుంజుకోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటించింది. దీంతో వ్యవసాయ దిగుబడులు ఎక్కువగా ఉంటాయని, వ్యవసాయ ఆధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే విశ్వాసం మదుపరులలో నెలకొంది. నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు వల్ల కుంటుపడిన భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకున్నదని, ఈ ఆర్థిక సంవత్సరం 7.3 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని, 2019-20లో 7.5 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని ప్రపంచ బ్యాంకు సోమవారం అంచనా వేసింది. ఇది కూడా మదుపరులలో ఉత్సాహాన్ని నింపింది.
విద్యుత్, స్థిరాస్తి, ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, లోహ, ఇన్‌ఫ్రా, ప్రభుత్వ రంగ సంస్థలు, చమురు- సహజ వాయువు, బ్యాంకింగ్ రంగాల షేర్లకు మంగళవారం మదుపరుల నుంచి అధికంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ), టెక్నాలజి, ఆరోగ్య సంరక్షణ, వాహన రంగాల షేర్లు మదుపరుల లాభాల స్వీకరణతో నష్టపోయాయి. మంగళవారం ఉదయం అధిక స్థాయి వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ మరింత పుంజుకొని ఇంట్రా-డేలో 34,434.14 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. అయితే, అధిక స్థాయిల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో ఈ సూచీ ప్రతికూల ధోరణిలోకి పడిపోయి, 34,229.83 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 89.63 పాయింట్ల లాభంతో 34,395.06 పాయింట్ల వద్ద ముగిసింది. ఫిబ్రవరి 26న 34,445.75 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్ ఆ తరువాత ఇంత ఎగువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ఈ సూచీ క్రితం ఎనిమిది సెషన్లలో కలిపి 1,286.36 పాయింట్లు పుంజుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 20.35 పాయింట్లు (0.19 శాతం) పుంజుకొని 10,548.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకుముందు ఈ సూచీ 10,560.45- 10,495.65 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా, సోమవారం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 308.13 కోట్ల విలువయిన షేర్లను, దేశీయ సంస్థాగత మదుపరులు రూ. 28.97 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. బుధవారం అక్షయ తృతీయ ఉండటంతో బంగారం, ఆభరణాలకు సంబంధించిన షేర్లకు మంగళవారం మదుపరుల నుంచి మంచి ఆదరణ లభించింది. బంగారాన్ని, బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి అక్షయ తృతీయను పవిత్రమయిన రోజుగా ప్రజలు భావిస్తుంటారు.
మంగళవారం సెనె్సక్స్ ప్యాక్‌లోని పవర్ గ్రిడ్ షేర్ విలువ అత్యధికంగా 2.94 శాతం పెరిగింది. ఎన్‌టీపీసీ 1.99 శాతం లాభంతో రెండో స్థానంలో నిలిచింది. లాభపడిన వాటిలో హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ లిమిటెడ్, భారతి ఎయిర్‌టెల్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిల్, టాటా స్టీల్ ఉన్నాయి. మరోవైపు, విప్రో సహా పలు ఐటీ కంపెనీల షేర్ల ధరలు 1.14 శాతం వరకు పడిపోయాయి.