బిజినెస్

రూ.2,654 కోట్ల టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: వడోదరకు చెందిన డైమండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (డీపీఐఎల్) ప్రమోటర్లు, డైరెక్టర్లను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. రూ.2,654 కోట్ల మేర బ్యాకు రుణాలను ఎగ్గొట్టారన్నది వీరిపై ప్రధాన ఆరోపణ. సురేష్ నారాయణ్ భట్నాగర్ ఆయన కుమారు లు అమిత్, సుమిత్‌లు డీపీఐఎల్‌కు ప్రమోటర్లుగా ఉన్నా రు. ఈ కంపెనీ విద్యుత్ కేబుళ్లు, పరికరాలను తయారుచేస్తుందని సీబీఐ తన చార్జ్‌షీటులో పేర్కొంది. కాగా ఈ సంస్థ తీసుకున్న రుణాన్ని 2016-17లో నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఎ)గా ప్రకటించారు. 32008 నుంచి ఈ కంపెనీ 11 బ్యాంకుల కన్సార్టియం నుంచి అక్రమంగా రుణాలు పొం దుతూ రాగా, 2016, జూన్ 29 నాటికి అవి రూ.2654.40 కోట్లకు చేరుకున్నాయి అని సీబీఐ పేర్కొంది. సీబీఐ అభ్యర్థన మేరకు కంపెనీ ప్రమోటర్లపై నాన్ బెయిలబుల్ వారం టు దాఖలైంది. బుధవారం అరెస్టు చేసిన కంపెనీ డైరెక్టర్ల ను అహమ్మదాబాద్ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫాల్టర్ల జాబితాలో, ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ రుణ పరిమితిపై జారీ చేసిన హెచ్చరిక జాబితాలో వీరిపేర్లున్నాయి. ఈ సంస్థకు సంబంధించిన నగదు రుణ పరిమితికి బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంకు. కన్సార్టియంలోని వివిధ బ్యాంకు అధికార్లను తెలివిగా ఒప్పించడం ద్వారా కంపెనీ రుణాలు సంపాదించగలిగిందని సీబీఐ పేర్కొంది. అంతేకాదు లీడ్ బ్యాంకుకు తప్పుడు స్టాక్ స్టేట్‌మెంట్లను సమర్పించిందని కూడా సీబీఐ ఆరోపించింది.