బిజినెస్

బయోఫ్లాక్ రొయ్యల సాగుతో మంచి ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 19: ఆక్వా రాజధానిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఆనంద ఫౌండేషన్ నవీన పద్ధతులతో చేపడుతున్న బయోఫ్లాక్ రొయ్యల సాగును విదేశీ శాస్తవ్రేత్తల బృందం గురువారం పరిశీలించింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో చేపడుతున్న ప్రోబయోటిక్స్ విధానం కన్నా బయోఫ్లాక్ విధానం రైతులకు ఉపయోగకరమని శాస్తవ్రేత్తలు అభిప్రాయపడ్డారు. బయోఫ్లాక్ విధానంలో నీరు కలుషితం కానందున 90 రోజుల సాగు అనంతరం నీటిని మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. రొయ్యకు సహజసిద్ధమైన వనరులతో ఆహారాన్ని అందించడంవల్ల ఆరోగ్యవంతంగా ఎదుగుతాయి. ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ దిగుబడులు లభిస్తాయి. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), బంగ్లాదేశ్, కెన్యా, భారత్ తదితర దేశాలకు చెందిన విదేశీ శాస్తవ్రేత్తలు ఇమ్మూక్యులేట్ సంస్థగా ఏర్పడ్డారు.
అంతర్జాతీయంగా రొయ్యల రైతులను వేధిస్తున్న వివిధ రకాల వ్యాధులు వాటి నివారణపై 2016 నుంచి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఈ సంస్థ విస్తృతంగా పరిశోధనలు చేస్తోంది. ఇమ్మాక్యులేట్ సంస్థకు చెందిన విదేశీ శాస్తవ్రేత్తలు యూకేకి చెందిన స్టర్లింగ్ విశ్వవిద్యాలయం పరిధిలో పనిచేస్తున్నారు. ప్రపంచంలోని ఆక్వా ఉత్పత్తుల్లో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం ప్రాంతానికి చెందిన ఆనంద ఫౌండేషన్‌తో 2017లో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. విదేశీ శాస్తవ్రేత్తల బృందం గత కొంత కాలంగా భారతదేశంలోని కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పర్యటించి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది. ఇక్కడ ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలోని హేచరీ, సీడ్, ఫీడ్, చెరువులను పరిశీలించింది. అనంతరం ఫౌండేషన్ ఛైర్మన్ కెవి విశ్వనాథరాజుతో కలిసి విదేశీ శాస్తవ్రేత్తలు డాక్టర్ ఫ్రాన్సిస్ ముర్రే, డాక్టర్ మహ్మద్ ఎల్తో, రీసెర్చ్ అసోసియేట్ హజరత్ అలీ, ఎండి బెలాల్ హుస్సేన్ విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 200 మంది రైతులకు చెందిన రొయ్యల చెరువులను పరిశీలించామన్నారు.
32 రోజులు 35 ట్యాంకుల్లో బయోఫ్లాక్ విధానంలో రొయ్యల సాగుపై పరిశోధనలు చేశామన్నారు. ఈ పరిశోధనల్లో రొయ్య ఎదుగుదల బాగుందని, ఫీడ్ వినియోగం తగ్గిందని, 90 రోజులకు మంచి ఫలితాలు వస్తాయన్నారు.

చిత్రం..రొయ్యలను పరిశీలిస్తున్న విదేశీ శాస్తవ్రేత్తల బృందం