బిజినెస్

కంటెయనర్ హ్యాండ్లింగ్‌లో 88 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: భారతదేశం తూర్పుతీరంలో ఉన్న దేశంలో అతి పెద్ద ఆల్ వెదర్ డీప్ వాటర్ పోర్ట్ కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ 2017-18 సంవత్సరంలో 45 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను హ్యాండ్లింగ్ చేసినట్లు ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే 25 శాతం వృద్ధిరేటును సాధించినట్లు పోర్టు సిఇవో, డైరెక్టర్ అనిల్ యెండ్లూరి తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2,55,439 టిఇయుల కంటైయినర్లను నిర్వహిస్తే, 2017-18లో 88 శాతం వృద్ధితో 4,81,408 టిఇయులను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. తమ పోర్టు ద్వారా బొగ్గు, ముడి ఇనుము, గ్రానైట్లు, కార్గో ఫోర్ట్ఫులియోల ఎగుమతి ముమ్మరంగా జరిగినట్లు చెప్పారు. ఈ పోర్టుమీద 3 బిలియన్ డాలర్ల పెట్టుబడిగా పెట్టాలని ప్రణాళిక ఉందని, ఇంతవరకు 1.23 బిలియన్ డాలర్లను ఖర్చుపెట్టినట్లు ఆయన చెప్పారు. తమ పోర్టును 2017 మార్చి 31వ తేదీ వరకు 1061 నౌకలు వచ్చాయని, 2018 మార్చి 31వరకు 1290 నౌకలు వచ్చాయన్నారు. తెలంగాణ,కర్నాటక, మహారాష్టల్రోని నాగ్‌పూర్‌లకు అత్యద్భుతమైన రైల్ కనెక్టివిటీ ఉండడంతో, 2018లో రవాణాలో వృద్ధి చోటు చేసుకుందన్నారు. కోస్టల్ కార్గో బెర్త్‌ను ఏర్పాటు చేసినట్లు పోర్టు కంటైయినర్ టర్మినల్ డైరెక్టర్ వినితా వెంకటేష్ చెప్పారు.
మహీంద్రాతో సింక్రనీ ఒప్పందం
అమెరికాలో మహీంద్రా పవర్ స్టోర్ట్స్ వాహనాలకు ఫైనాన్సింగ్ చేసేందుకు వీలుగా ఆ సంస్థతో ఒప్పందం ఖరారు చేసినట్లు సింక్రనీ పే మెంట్ సొల్యూషన్స్ సిఇవో నీరజ్ మెహతా తెలిపారు. కొత్త, ఉపయోగించిన వాహనాలకు ఫైనాన్సింగ్ సేవలు అందిస్తామన్నారు. అమెరికా మార్కెట్‌లో మహీంద్ర వాహనాలు ప్రవేశించేందుకు సింక్రనీ సంస్థ సహకారం అందించిందని మహీంద్రా సేల్స్ వైస్‌ప్రెసిడెంట్ లుక్‌డే గాస్ప్ బ్యూబియన్ తెలిపారు. సింక్రనీ సంస్థ హైదరాబాద్‌లో 20 సంవత్సరాలుగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. చిన్నతరహా వాణిజ్య కార్యకలాపాలకు బజాజ్ ఫైనాన్స్ రుణాలు
చిన్న తరహా వర్తక, వాణిజ్య కార్యకలాపాలకు రుణాలు అందించాలని నిర్ణయించినట్లు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటించింది. 24 గంటల్లో రుణాలను మంజూరు చేస్తామని ఆ సంస్థ తెలిపింది. తమ అవసరాలకు అనుగుణం రుణ పరపతిని వినియోగించుకోవచ్చని తెలిపింది. రూ.30 లక్షల వరకు రుణాలు ఇస్తామని తెలిపింది.