బిజినెస్

నాలుగోవారమూ లాభపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో వారం బలపడ్డాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 222.93 పాయింట్లు పుంజుకొని 34,415.58 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కీలకమయిన 10,500 పాయింట్ల స్థాయికి పైన 10,564.05 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత వాతావరణం నెలకొన్నప్పటికీ, ఈ సంవత్సరం వర్షపాతం సాధారణ స్థాయిలో ఉంటుందన్న వాతావరణ శాఖ అంచనాలు, కార్పొరేట్ కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు బాగుండటం వల్ల షేర్ల ధరల పెరుగుదలకు దోహదపడే రీతిలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. అయితే, జూన్‌లో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సంకేతాలను రిజర్వ్ బ్యాంక్ మినట్స్ వెల్లడించడంతో మార్కెట్లలో కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం పటిష్ఠమయిన స్థితిలో ప్రారంభమయ్యాయి. సిరియా అంశంపై అమెరికా, రష్యాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే, టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గడం, కొన్ని నిర్దిష్ట సంస్థల షేర్లలో వచ్చిన ర్యాలీ మార్కెట్‌ను బలోపేతం చేసింది. దీంతో సెనె్సక్స్ గత మూడేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా వరుసగా ఎక్కువ సెషన్ల పాటు పుంజుకుంది. చమురు- సహజ వాయువు, కీలకమయిన బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పాటు ఇటీవలి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఆర్‌బీఐ చేసిన వ్యాఖ్యల వల్ల జూన్‌లో వడ్డీ రేట్లు పెరుగుతాయనే ఆందోళన మదుపరులలో నెలకొనడం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. అయితే, లోహ (మెటల్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ), టెక్నాలజి షేర్లు బలపడటం మార్కెట్‌లో ఉత్సాహపూరితమయిన వాతావరణాన్ని నింపింది. కీలకమయిన ఐటీ సంస్థలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), మైండ్‌ట్రీ నాలుగో త్రైమాసికంలో ఆకర్షణీయమయిన లాభాలను ఆర్జించడంతో ఈ వారంలో స్టాక్ మార్కెట్‌లో ఐటీ రంగ షేర్ల ధరలు బాగా పెరిగాయి.
సెనె్సక్స్ ఈ వారం 33,944.73 పాయింట్ల వద్ద ప్రారంభమయి, 34,591.81- 33,899.34 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 222.93 పాయింట్ల (0.65 శాతం) లాభంతో 34,415.58 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం వారం 1,596.11 పాయింట్లు (4.90 శాతం) పుంజుకుంది. నిఫ్టీ ఈ వారం 10,398.30 పాయింట్ల వద్ద ప్రారంభమయి, 10,594.20- 10,396.35 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 83.45 పాయింట్ల (0.80 శాతం) లాభంతో 10,564.05 పాయింట్ల వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు కూడా ఈ వారం స్వల్పంగా లాభపడ్డాయి.
మెటల్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, టెక్నాలజి, స్థిరాస్తి, పవర్, ఆరోగ్య సంరక్షణ, క్యాపిటల్ గూడ్స్, ఐపీఓ రంగాల షేర్లకు ఈ వారంలో అధికంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు, చమురు- సహజ వాయువు, బ్యాంకులు, పీఎస్‌యూలు, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, వాహన రంగాల షేర్లు లాభాల స్వీకరణకు గురయ్యాయి. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) కలిసి ఈ వారంలో నికరంగా రూ. 3,033.72 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.