బిజినెస్

ఆక్వా రైతుకు పండుగ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 22: ‘ఆక్వా పాలసీ’ని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సంబంధించిన విధివిధానాలను కూడా ఖరారుచేసింది. ఈ మేరకు జీవో 16ను విడుదలచేసింది. రానున్న రోజుల్లో ఆక్వా రైతులకు బాసటగా ఉంటూ ప్రభుత్వం తన నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి వీలుగా ఈ జీవోను రూపొందించింది. 2019-20 నాటికి 27.66 లక్షల టన్నులున్న ఆక్వా ఉత్పత్తులను 42 లక్షల టన్నులకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టర్నోవర్ రూపంలో రూ.80 వేల కోట్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆక్వా రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 16తో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇక్కడి రైతాంగం గత 30 ఏళ్లుగా పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ప్రతిసారి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చుచేసి సీడును తెచ్చుకునేవారు. ఒకవేళ ఆ సీడుకు వైరస్ వస్తే నష్టం రూ.కోట్లలోనే ఉంటుంది. ఇలా ప్రతిసారి నష్టాలను చవి చూస్తూనే ఉన్నారు. ఇటువంటి కష్టాలను తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అపెక్స్ కమిటీ, టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. ఆక్వా సాగులో కలుగుతున్న కష్టాలు, నష్టాల గురిం చి నివేదిక కోరింది. 2015 నుంచి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా సాగు జరుగుతున్న జిల్లాల్లో సభలు, నిర్వహించి నివేదికను రూపొందించింది.