బిజినెస్

అయిదు ట్రిలియన్ డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 22: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగే సత్తా భారత్‌కు ఉందని, భారత్‌లో గత కొనే్నళ్లుగా అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభమయిందని, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2025 నాటికి అయిదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భారతదేశ ఉన్నత స్థాయి అధికారి ఒకరు ప్రపంచ బ్యాంకుకు చెప్పారు. భారత్ అభివృద్ధి విషయంలో ఈ రీజియన్‌లోనే ఒక ధ్రువతారగా కొనసాగుతోందని దక్షిణాసియా దేశాల (్భటాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక) ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ శుక్రవారం ఇక్కడ జరిగిన ప్రపంచ బ్యాంకు అభివృద్ధి కమిటీ 97వ సమావేశంలో మాట్లాడుతూ వివరించారు. 3్భరత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. 2018లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.4 శాతం ఉంటుందని మా అంచనా2 అని ఆయన పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)తో పాటు ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాన్‌క్రప్టసి కోడ్, బ్యాంకులకు మూల ధన సమీకరణ, వౌలిక సౌకర్యాల రంగంలో పెట్టుబడులకు ద్వారాలు తెరవడం వంటి పరివర్తనా సంస్కరణలు దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడతాయని ఆయన అన్నారు. 3ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి, డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను పెంపొందించడానికి భారత్ గత కొనే్నళ్లుగా ఎన్నో వ్యవస్థీకృత సంస్కరణలు అమలు చేసింది2 అని గార్గ్ పేర్కొన్నారు. భారత్ గత నాలుగేళ్లుగా సగటున ఏటా 7.2 శాతం వృద్ధి రేటుతో అభివృద్ధి చెందిందని, ఈ నిలకడయిన అభివృద్ధి పథం మున్ముందు కూడా కొనసాగుతుందని ఆయన వివరించారు.