బిజినెస్

సరకు రవాణాలో విశాఖ పోర్టుకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 21: సరకు రవాణాలో విశాఖపట్నం పోర్టు ట్రస్టు మరో కీలక భూమిక పోషించనుంది. ఇప్పటి వరకూ కోల్‌కతా పోర్టు నుంచి సరిహద్దు దేశం నేపాల్‌కు సరకు రవాణా జరిగేది. తాజాగా విశాఖ పోర్టును సైతం కేంద్ర ప్రభుత్వం గేట్‌వే పోర్టుగా ప్రకటించడంతో ఎగుమతి, దిగుమతుల్లో మరింత పురోగతి సాధించేందుకు ఆస్కారమేర్పడనుంది. రైలు, రోడ్డు మార్గాల అనుసంధానం ఈ మేరకు విశాఖ పోర్టుకు ఈ అవకాశాన్ని దక్కించింది. చైనా నుంచి వచ్చే సరకును విశాఖ పోర్టు నుంచి రోడ్డు, రైలు మార్గాల గుండా నేపాల్‌కు తరలిస్తారు. దేశంలోని ఇతర మేజర్ పోర్టులకు భిన్నంగా అన్ని వసతులు, వౌలిక సదుపాయాలతో కూడిన కంటైనర్ టెర్నినల్ విశాఖ పోర్టు సొంతం. ప్రస్తుతానికి కోల్‌కతా, హల్దియా పోర్టులు మాత్రమే నేపాల్‌కు సరకు రవాణాలో ఎగుమతి,దిగుమతుల పాలసీకి అనుగుణంగా పనిచేస్తున్నాయి. తాజాగా ఆజాబితాలో విశాఖపట్నం పోర్టు చేరింది. నేపాల్‌తో భారత్ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా విశాఖ పోర్టు నుంచి సరకు విషయంలో వౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు నేపాల్ బృందం ఈ నెల 23, 24 తేదీల్లో విశాఖ పోర్టును సందర్శించనుంది.