బిజినెస్

రూ. 91,153 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అత్యంత విలువయిన పది భారత కంపనీలలోని ఆరు కంపనీల మొత్తం మార్కెట్ విలువ (ఎం-క్యాప్) శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో రూ. 91,152.73 కోట్లకు చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ వేగంగా పెరగడం ఇందుకు దోహదపడింది. టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, కోటక్ మహింద్రా బ్యాంక్ ఈ వారం లో అత్యధికంగా లబ్ధి పొందగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్), హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి సుజుకి ఇండియా, ఓఎన్‌జీసీ తమ మార్కెట్ విలువను నష్టపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ) దిగ్గజం టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 48,890.9 కోట్లు పెరిగి, రూ. 6,52,082.92 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ పది అత్యంత విలువయిన కంపెనీలలో అధికంగా లబ్ధి పొందిన సంస్థగా నిలిచింది. టీసీఎస్ షేర్ విలువ శుక్రవారం సుమారు ఏడు శాతం పెరగడం వల్ల దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ వంద బిలియన్ డాలర్ల స్థాయికి చేరువలోకి చేరింది. శుక్రవారం ఒక్క రోజులోనే ఈ సంస్థ మార్కెట్ విలువ 6.2 బిలియన్ డాలర్లు పెరిగింది. ఐటీసీ మార్కెట్ విలువ ఈ వారంలో రూ. 18,489.51 కోట్లు పెరిగి, రూ. 3,36,777.52 కోట్లకు చేరింది. హిందుస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 12,078.07 కోట్లు పెరిగి, రూ.3,17,211.69 కోట్లకు చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.8,537.85 కోట్లు పెరిగి, రూ. 5,08,884.23 కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,021.81 కోట్లు పెరిగి, రూ. 2,57,344.77 కోట్లకు చేరుకుంది. కోటక్ మహింద్రా బ్యాంక్ ఎం-క్యాప్ రూ. 1,134.59 కోట్లు పుంజుకొని, రూ. 2,19,997.59 కోట్లకు చేరుకుంది.