బిజినెస్

భారత్‌కు విదేశీ మారక వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు భారత్‌కు పంపుతున్న మొత్తం గత ఏడాది అత్యధిక స్థాయికి చేరుకుందని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. మొత్తం 69 బిలియన్ డాలర్ల మేర భారత సంతతి ప్రజలు స్వదేశానికి జమ చేశారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ప్రవాస భారతీయులకు జమయ్యే మొత్తం 9.9 శాతం మేర పెరిగిందని తెలిపింది. వలసలు, అభివృద్ధికి సంబంధించిన నివేదికలో తమ తమ మాతృ దేశాల ప్రవాసీయులు ఎంత మొత్తాన్ని జమ చేస్తున్నారన్న వివరాలను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. మధ్య, దిగువ స్థాయి ఆదాయం కలిగిన దేశాల్లో అధికంగా జమ అయిన ఈ మొత్తం 2017లో 466 బిలియన్ డాలర్ల మేర ఉందని వివరించింది. 2016లో జమ అయిన 429 బిలియన్ డాలర్ల మొత్తంతో పోలిస్తే గత ఏడాది ఆయా దేశాలకు జమ అయిన మొత్తం 8.5 శాతం ఎక్కువ అని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ రెమిటెన్స్‌లు గత ఏడాది 7 శాతం పెరిగి 613 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వివరించింది. ముఖ్యంగా ఐరోపా, రష్యా, అమెరికాల్లో వృద్ధి రేటు పుంజుకోవడం ఇందుకు ప్రధానంగా కారణమైందని తెలిపింది. వీటి ఫలితంగా యూరో, రూబుల్ తదితర మారక విలువ కూడా పెరిగిందని తెలిపింది. ఇతర దేశాలతో పోలిస్తే వివిధ దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయుల నుంచి భారత్‌కు అత్యధిక స్థాయిలో రెమిటెన్స్‌లు వస్తున్నాయని, 64 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో, 33 బిలియన్ డాలర్లతో ఫిలిప్పీన్స్ మూడో స్థానంలో, 31 బిలియన్ డాలర్లతో మెక్సికో నాలుగో స్థానంలో, 20 బిలియన్ డాలర్లతో ఈజిప్టు ఐదవ స్థానంలో ఉన్నాయని తెలిపింది.