బిజినెస్

చరిత్ర సృష్టించిన టీసీఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: భారతీయ ఐటీ కంపెనీల్లో టాటా కనె్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిరుపమాన ఘనత సాధించింది. వంద బిలయన్ డాలర్ల మేర మార్కెట్ విలువను సంతరించుకుని కీర్తిపతాకను ఎగురవేసింది. సోమవారం జరిగిన మార్కెట్ లావాదేవీల్లో టీసీఎస్ కంపెనీ షేర్ల మొత్తం విలువ ఒక దశలో వంద బిలియన్ డాలర్లకు (6,80,912.10కోట్ల రూపాయలు) చేరుకుంది. అయితే అనంతరం క్రమంలో దీని విలువ స్వల్పంగా అంటే 98.8 బిలియన్ డాలర్లకు (6,53,767.50కోట్ల రూపాయలు) తగ్గినప్పటికీ వంద బిలియన్ డాలర్ల మార్కును చేరుకోవడం నిరుపమాన ఘనతగా చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్ సేవలను విదేశాలకు అందిస్తున్న టీసీఎస్ మొదటినుంచీ కూడా వంద బిలియన్ డాలర్ల మార్కును చేరుకోవాలన్న లక్ష్యంతోనే ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతూ వచ్చింది. వంద బిలియన్ డాలర్ల టీసీఎస్ మార్కెట్ విలువ పాకిస్తాన్ స్టాక్ ఎక్ఛేంజీలో నమోదైన లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ కంటే ఎక్కువే. నేటి లావాదేవీల్లో టీసీఎస్ షేర్ 4.4 శాతం మేర పెరిగి 3,553 రూపాయలకు చేరుకుంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారీ లాభాలను టీసీఎస్ ఆర్జించడం కూడా ఈ తాజా ఘనతకు దోహదం చేసింది. శుక్రవారం ముగిసిన లావాదేవీల నాటికి టీసీఎస్ షేర్లు 7 శాతం పెరిగి దాని మొత్తం మార్కెట్ విలువకు మరో 41,301కోట్ల రూపాయలు చేరాయి. టీసీఎస్ తర్వాత రెండో స్థానంలో 5,92,427.82కోట్ల మార్కెట్ విలువతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది. హెడీఎఫ్‌సీ (5,01,643.92 కోట్లు) మూడో స్థానంలో, ఐటీసీ (3,35,801.17 కోట్లు) నాలుగో స్థానంలో, హిందూస్థాన్ లివర్ (3,14,938.94 కోట్లు) ఐదో స్థానంలో ఉన్నాయి.