బిజినెస్

ఎస్‌బిఐ ఎటిఎమ్ ఆదాయం రూ. 310 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, జూన్ 21: నెలకు ఐదుసార్లు మించి ఎటిఎమ్ లావాదేవీలు జరిపేవారు ఎక్కువ కావడంతో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ ఎటిఎమ్ ఆదాయం 47 శాతం పెరిగింది. నెలకు ఉచితంగా ఐదుసార్లు ఎటిఎమ్‌ను వినియోగించుకునే అవకాశం ఉన్నది తెలిసిందే. అయితే ఆరోసారి వినియోగం నుంచి ఒక్కో లావాదేవీకి 20 రూపాయల చొప్పున ఖాతాదారుడి వద్ద డబ్బులు వసూలు చేస్తుంది ఎస్‌బిఐ. ఈ క్రమంలో ఇలా జరిగిన లావాదేవీల ద్వారా గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఎస్‌బిఐకి వచ్చిన ఆదాయం 310.44 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) క్రింద చంద్రశేఖర్ గౌడ్‌కు ఎస్‌బిఐ తెలియజేసింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు చెందిన ఆర్‌టిఐ కార్యకర్త ఈయన. కాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15)తో పోల్చితే ఇది 47.5 శాతం అధికం. నాడు 210.47 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే ఏడాదిలో సుమారు 100 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందన్నమాట. 2014 నవంబర్ నుంచి ఎటిఎమ్ లావాదేవీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పరిమితి విధించినది తెలిసిందే. నెలకు ఐదుసార్లు మించి ఎటిఎమ్‌ను వినియోగిస్తే ఒక్కోదానికి అదనంగా చార్జీలు వసూలు చేసుకోవచ్చని బ్యాంకులకు చెప్పింది. ఎటిఎమ్‌ల వినియోగం మితీమీరడంతో బ్యాంకులకు భారీగా నష్టాలు వాటిల్లాయి. అవసరం ఉన్నా, లేకపోయినా ఉచితంగానే కదా అని కనిపించిన ఎటిఎమ్‌లలో కార్డులు గీకేసేవారు పెరిగిపోయారు. దీనివల్ల ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకు ఈ లావాదేవీలను ఇచ్చిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఆర్థిక భారంతోపాటు సిబ్బందికి పని భారం కూడా పెరిగింది. ఒక్క ఎస్‌బిఐకే ఈ కారణంగా వచ్చిన నష్టం వందలాది కోట్ల రూపాయలుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్‌బిఐ.. ఎటిఎమ్ లావాదేవీలకు నెలసరి పరిమితులు విధించాల్సి వచ్చింది. ఇదిలావుంటే ఎటిఎమ్ ఉచిత లావాదేవీల పరిమితిని పెంచాలని గౌడ్ ఎస్‌బిఐని డిమాండ్ చేశారు.
ఆర్‌బిఐపై రెగ్జిట్ ప్రభావం ఉండదు
ముంబయి: ఈ ఏడాది సెప్టెంబర్ 4న పదవీకాలం ముగిశాక రఘురామ్ రాజన్ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకుంటే.. దాని ప్రభావం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)పై ఏ విధంగానూ ఉండబోదని ఎస్‌బిఐ రిసెర్చ్ అంచనా వేసింది. రాజన్ మూడేళ్ల పదవీకాలం తీరిపోతుండగా, పలు వివాదాస్పద పరిణామాల మధ్య రెండోసారి ఈ బాధ్యతలను చేపట్టలేనని గత వారం ప్రకటించినది తెలిసిందే. ఇది శుభ శకునం కాదని, దేశ ఆర్థిక వ్యవస్థకు రాజన్ నిష్క్రమణ ఇబ్బందులను తెచ్చిపెడుతుందని ఆర్థిక, వ్యాపార, పారిశ్రామిక రంగాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అవన్నీ ఊహాగానాలేనని ఎస్‌బిఐ రిసెర్చ్ కొట్టిపారేసింది.