బిజినెస్

జీఎంఆర్ ఎయర్ పోర్టుకు మరో అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: హైదరాబాద్ జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిష్టాకరమైన గోల్డ్ ఎసిఐ ఆసియా పసిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ 2018 గుర్తింపు లభించింది. సాలీనా 5 నుంచి 15 మిలియన్ల ప్యాసింజర్లు ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణిస్తున్నారు. ఈ అవార్డును జిఎంఆర్ సిఇవో ఎస్‌జికె కిషోర్ అందుకున్నారు. ఈ అవార్డును జపాన్‌లోని ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఆసియా పసిఫిక్ రీజనల్ అసెంబ్లీ సమావేశంలో ప్రదానం చేశారు. ఈసందర్భంగా ఎస్‌జికె కిషోర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తాము చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.