బిజినెస్

ఇంధన షేర్ల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంగళవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మూడేళ్ల గరిష్ఠ స్థాయికి పెరిగిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇంధన రంగ షేర్లకు మదుపరుల నుంచి భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో కీలక సూచీలు పైకి ఎగబాకాయి. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 3.70 శాతం లబ్ధి పొందింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) ఎనర్జీ ఇండెక్స్ అన్ని రంగాల సూచీలకన్నా అధికంగా పుంజుకుంది. బీఎస్‌ఈ సెనె్సక్స్ 165.87 పాయింట్లు పుంజుకొని, 34,616.64 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 29.65 పాయింట్లు పెరిగి, 10,614.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) ఎడతెరిపి లేకుండా కొనుగోళ్లు జరపడం, బ్లూచిప్ కంపెనీలు సాధించిన ప్రోత్సాహకర నికర లాభాలు కూడా కీలక సూచీలు పుంజుకోవడానికి దోహదపడ్డాయని బ్రోకర్లు చెప్పారు. ఇరాన్, ఒపెక్ దేశాలపై అమెరికా ఆంక్షల పునరుద్ధరణ కారణంగా చమురు సరఫరాలపై ప్రతికూల ప్రభావం చూపి 2014 నవంబర్ తరువాత తొలిసారిగా చమురు ధరలు గరిష్ఠ స్థాయికి, బారెల్‌కు 75 డాలర్లకు చేరుకున్నాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ మంగళవారం 34,491.38 పాయింట్ల సానుకూల స్థాయి వద్ద ప్రారంభమయి, ఇంట్రా-డేలో మరింత ముందుకు సాగుతూ 34,706.71 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 165.87 పాయింట్లు (0.48 శాతం) పుంజుకొని 34,616.64 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారం లాభపడిన షేర్లలో యెస్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, అదాని పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్‌జీసీ ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 10,636.80- 10,569 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 29.65 పాయింట్లు (0.28 శాతం) పెరిగి 10,614.35 పాయింట్ల మధ్య స్థిరపడింది. అయితే, లోహ, ఐటీ, టెక్నాలజి, పవర్, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, పీఎస్‌యూ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్ల లాభాలను తగ్గించింది. ఇదిలా ఉండగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) సోమవారం నికరంగా రూ. 387.26 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 259.08 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
మంగళవారంనాటి లావాదేవీల్లో సెనె్సక్స్ ప్యాక్‌లోని రిల్, యెస్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, అదాని పోర్ట్స్ ఎక్కువగా లాభపడ్డాయి. లాభపడిన ఇతర సంస్థల్లో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, సన్ ఫార్మా ఉన్నాయి. భారతి ఎయిర్‌టెల్ కూడా స్వల్పంగా లాభపడింది. మరోవైపు, నాలుగో త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఐడీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ విలువ 1.24 శాతం పడిపోయింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ ధర 1.05 శాతం పెరిగింది. మరోవైపు, విప్రో, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, టీసీఎస్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, ఆసియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్ల విలువ పడిపోయింది.