బిజినెస్

కస్టమర్లే బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: వాణిజ్య పరమైన అవరోధాలను అధిగమించి స్టీల్‌ప్లాంట్ వార్షిక వృద్ధిరేటు సాధించే దిశగా సంస్థ ముందుకు సాగుతోందని విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ వీ మధుసూదన్ అన్నారు. విశాఖలో ఆలిండియా కస్టమర్ల మీట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాది వార్షిక టర్నోవర్ రూ.16,500 కోట్లను ఈ సారి అధిగమించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్లాంట్ విస్తరణతో 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని సొంతం చేసుకున్న సంస్థ అందుకు అనుగుణంగా మార్కెటింగ్ సదుపాయాలు విస్తరించుకుంటోందన్నారు. మల్టీమోడ్ ట్రాన్స్‌పోర్ట్ విధానాన్ని అనుసంధానించుకోవడం ద్వారా చివరి ఖాతాదారు వరకూ సంస్థ ఉత్పత్తుల్ని తీసుకువెళ్లగలుగుతున్నామన్నారు. ఇదే సందర్భంలో ఖాతాదారులకు అనుగుణంగా సేవలందించడం ద్వారా వారిలో నమ్మకాన్ని పెంచగలిగామన్నారు. ఇదే సందర్భంలో స్టీల్‌ప్లాంట్ సాధించే ప్రగతిలో ఖాతాదారులదే కీలకపాత్రగా అభివర్ణించారు. ఇదే సందర్భంలో సంస్థ వివిధ ప్రాంతాలకు ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు సముద్ర రవాణాపై దృష్టి సారించిందన్నారు. స్టీల్‌ప్లాంట్ కమర్షియల్ డైరెక్టర్ పీ రాయ్ చౌదరి మాట్లాడుతూ సంస్థ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేలా ఖాతాదారులను సమన్వయం చేసుకుంటూ వారి ఆలోచనలకు తగిన విధంగా ఉత్పత్తులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సంస్థ మార్కెటింగ్ విధానానికి రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు. సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ పీకె రథ్ మాట్లాడుతూ 2018-19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 6 మిలియన్ టన్నుల లిక్విడ్ స్టీల్, 5.5 మిలియన్ టన్నుల సేలబుల్ స్టీల్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఖాతాదారుల అనుమానాలు నివృత్తి చేశారు. సమావేశంలో ఫైనాన్షియల్ డైరెక్టర్ వీవీ వేణుగోపాల్, మార్కెటింగ్ జీఎం ఎస్‌కే చక్రబర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..కస్టమర్స్ మీట్‌లో మాట్లాడుతున్న స్టీల్‌ప్లాంట్ సీఎండీ మధుసూదన్