బిజినెస్

20 శాతం పెరగనున్న ఇంధన ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 25: చమురు, సహజవాయువు, బొగ్గు వంటి ఇంధనాల ధరలు ఈ ఏడాది మరో 20 శాతం పెరగనున్నాయని ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. ఈ పెరుగుదల వల్ల 80 శాతం ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి విదేశాలపై ఆధారపడుతున్న భారత్‌పై పెను భారం పడనుంది. గత అక్టోబర్ నెలనుంచి పరిశీలిస్తే వీటి ధరల్లో 16 శాతం వృద్ధి నమోదైందని, ప్రపంచ బ్యాంకు తన 3ఏప్రిల్ వస్తు మార్కెట్ సమీక్ష2లో పేర్కొంది. 2018లో చమురు ధరలు సగటున బ్యారల్‌కు 65 యుఎస్ డాలర్లుగా కొనసాగాయి. 2017లో బ్యారల్ ధర కేవలం 53 యుఎస్ డాలర్లు మాత్రమే.
ఇక లోహాల ధరల్లో ఈ ఏడాది 9 శాతం వృద్ధి నమోదుకానున్నదని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. సరఫరా పరంగా ఆటంకాలు కొనసాగినప్పటికీ డిమాండ్ మాత్రం అధికంగా నమోదు కానున్నదని అంచనా వేసింది. అదేవిధంగా ఆహార ఉత్పత్తులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు, ముడిపదార్ధాల ధరలు ఈ ఏడాది రెండుశాతం వృద్ధిని నమోదు చేయనున్నాయని ప్రపంచబ్యాంక్ పేర్కొం ది. ప్రపంచ వ్యాప్తంగా ప్రగతి రేటు పుంజుకోవడం, మరోవైపు డిమాండ్ కూడా పెరగడం, అంతర్జాతీయంగా కొన్ని వస్తువుల ధరలు పెరగడానికి దోహదం చేయనున్నాయి2 అని ప్రపంచ బ్యాంకు సీనియర్ డైరెక్టర్ శాంతాయనన్ దేవరాజన్ పేర్కొన్నారు. అయితే చమురు ధరలు 2018, ఏప్రిల్ స్థాయితో పోలిస్తే క్రమంగా తగ్గుముఖం పట్టి,2019లో చమురు ధరలు బ్యారల్‌కు సగటున 65 అమెరికన్ డాలర్లుగానే కొనసాగవచ్చునని అంచనా వేసింది. ముఖ్యంగా నాన్ ఒపెక్ దేశాలనుంచి డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ, చమురు ఉత్పత్తిలో ఒపెక్ దేశాలు సంయమనం పాటించడమే ఇందుకు కారణమని అంచనా వేసింది. అంతర్జాతీయంగా చమురు వినియోగం 2018 తొలి త్రైమాసికంలో 1.6 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశముంది. ఇక ఓఈసీడీ సభ్య దేశాల్లో వినియోగ వృద్ధి 1.4 శాతం పుంజుకోనుంది. ప్రాథమికంగా ఉత్తర అమెరికాలో అతి శీతల వాతావరణం కారణంగా చమురు డిమాండ్ అధికంగా ఉన్నది. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే నాన్-ఓఈసీడీ దేశాల్లో చమురు వినియోగం 1.8 శాతం పెరిగింది. ఇక భారత్ విషయానికి వస్తే, వినియోగ డిమాండ్ 11 శాతం వృద్ధి నమోదు చేసిందని బ్యాంకు పేర్కొంది.