బిజినెస్

బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 26: యెస్ బ్యాంక్ నాలు గో త్రైమాసికంలో ఆర్జించిన ఆకర్షణీయ నికర లాభం కారణంగా ఆ బ్యాంకు నేతృత్వంలో బ్యాంకింగ్ షేర్లలో వచ్చిన ర్యాలీ వల్ల గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ) షేర్లకు కూడా మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ పుంజుకున్నాయి. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో యెస్ బ్యాంక్ షేర్ విలువ అత్యధికంగా 8.26 శాతం పెరిగింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో తన నికర లాభం 29 శాతం వృద్ధితో రూ. 1,179.40 కోట్లకు పెరిగినట్టు యెస్ బ్యాంక్ ప్రకటించిన తరువాత ఆ బ్యాంక్ షేర్ ధర బాగా పెరిగింది. గురువారం సెనె్సక్స్ సానుకూల స్థాయి 34,532.95 పాయింట్ల వద్ద ప్రారంభమయి, తరువాత ముందుకు సాగుతూ ఇంట్రా-డేలో 34,747.97 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 212.33 పాయింట్లు (0.62 శాతం) పుంజుకొని 34,713.60 పాయింట్ల వద్ద ముగిసింది. ఫిబ్రవరి 5న 34,757.16 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్ ఆ తరువాత ఇంత అధిక స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 47.25 పాయింట్లు (0.45 శాతం) పుంజుకొని, 10,617.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకుముందు ఈ సూచీ 10,628.40- 10,559.65 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా, బుధవారం నాటి లావాదేవీల్లో దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 435.98 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 304.79 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. ఆసియా మార్కెట్లలో గురువారం మిశ్రమ ధోరణి కనిపించింది. యూరప్‌లో అధిక స్థాయిల వద్ద మార్కెట్లు ప్రారంభమయ్యాయి. గురువారంనాటి లావాదేవీల్లో సెనె్సక్స్ ప్యాక్‌లోని లాభపడిన ఇతర సంస్థల్లో హెచ్‌యూఎల్, టీసీఎస్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, అదాని పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి సుజుకి, ఎన్‌టీపీసీ ఉన్నాయి. ఇదిలా ఉండగా, నాలుగో త్రైమాసికంలో నిరుత్సాహకరమైన లాభాలను ఆర్జించిన విప్రో షేర్ విలువ రెండు శాతం పడిపోయింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో భారతి ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఆసియన్ పెయింట్స్, సన్ ఫార్మా ఉన్నాయి. బీఎస్‌ఈ రంగాల వారీ సూచీలలో ఎఫ్‌ఎంసీజీ 1.25 శాతం పుంజుకుంది. ఐటీ 1.17 శాతం, బ్యాంకింగ్ 0.86 శాతం, టెక్నాలజి 0.59 శాతం, కన్స్యూమర్ డ్యూరేబుల్స్ 0.43 శాతం, ఆటో 0.33 శాతం, మెటల్ 0.12 శాతం, చమురు- సహజ వాయువు 0.07 శాతం చొప్పున పుంజుకున్నాయి.