బిజినెస్

సరుకు రవాణాకు స్థిరమైన చార్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్, జువారీ సిమెం ట్స్ లిమిటెడ్‌తో దక్షిణ మధ్య రైల్వే దీర్ఘకాలిక టారిఫ్ కాంట్రాక్ట్ (ఎల్‌టిటిసి) ఒప్పందం చేసుకుంది. గురువారం నాడిక్కడ రైల్ నిలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందం జరిగింది. ద.మ.రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎం.జి.శేఖరం, రామ్‌కో మార్కెటింగ్ ప్రెసిడెంట్ ఎన్.రవిశంకర్, జువారీ మార్కెటింగ్ ప్రెసిడెంట్ వివిఎల్ నరసింహారావులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశా రు. ఈ ఒప్పందం ప్రకారం ఐదేళ్లు, మూడేళ్ల పాటు స్ధిరంగా సరుకు రవా ణా చార్జీలు కొనసాగుతాయి. గతం లో ఇలాగే అల్ట్రాటెక్ సిమెంట్, ఇండి యా సిమెంట్స్, ఓరియంట్ సిమెం ట్స్, కేశోరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లతో ద.మ.రైల్వే ఒప్పం దం చేసుకుంది. ఒకసారి ఒప్పందం చేసుకుంటే ఆ ప్రకారం సరుకు రవాణా చార్జీలు ఏడాది పాటు స్ధిరంగా ఉం టాయని రైల్వే తెలిపింది. దీని వల్ల కస్టమర్ ఎలాంటి చార్జీల మార్పులు, చేర్పులు భారం లేకుండా ఏడాది పాటు తమ లాజిస్టిక్ సదుపాయాన్ని పొందేందుకు వీలుంటుందన్నారు.