బిజినెస్

రూ. 2,597 కోట్లు పడిపోయిన విప్రో మార్కెట్ విలువ నికర లాభం తగ్గడమే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: నాలుగో త్రైమాసికంలో విప్రో నికర లాభం 20 శాతానికి పైగా పడిపోవడంతో ఆ కంపెనీ షేర్ ధర గురువారం రెండు శాతం దిగజారింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్‌ఈ)లో విప్రో షేర్ విలువ గురువారం రూ. 281.45 వద్ద ముగిసింది.
ఇంట్రా-డేలో ఒక దశలో ఈ కంపెనీ షేర్ ధర 4.56 శాతం దిగజారి రూ. 274.10కు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో కూడా విప్రో షేర్ ధర రెండు శాతం దిగజారి, రూ. 281.35 వద్ద ముగిసింది. షేర్ విలువ గణనీయంగా పడిపోవడంతో విప్రో మార్కెట్ విలువ (ఎం-క్యాప్) రూ. 2,597.22 కోట్లు తగ్గి, రూ. 1,27,325. 78 కోట్లకు దిగజారింది. ఈక్విటి పరిమాణం రీత్యా చూస్తే బీఎస్‌ఈలో గురువారం 5.31 లక్షల విప్రో షేర్లు ట్రేడ్ అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో 95 లక్షలకు పైగా షేర్లు చేతులు మారా యి. విప్రో బుధవారం వెల్లడించిన ఫలితాలలో ఆ కంపెనీ నాలుగో త్రైమాసికంలో నికర లాభం 20 శాతానికి పైగా పడిపోయి, రూ. 1,800.8 కోట్లకు చేరుకుంది.