బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 54.14 పాయింట్లు నష్టపోయి 26,812.78 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 18.60 పాయింట్లు కోల్పోయి 8,219.90 వద్ద నిలిచింది. ఐరోపా యూనియన్‌లో ఉండాలా? లేదా? అన్నదానిపై గురువారం బ్రిటన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న క్రమంలో విదేశీ మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే సోమవారం లాభాల్లో పరుగులు పెట్టిన సూచీలు.. మంగళవారం నష్టాల్లోకి జారుకోవాల్సి వచ్చింది. యుటిలిటీస్, పవర్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్ రంగాల షేర్ల విలువ 0.78 శాతం నుంచి 0.40 శాతం మేర పడిపోయింది. అయితే ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, గ్యాస్ రంగాల షేర్ల విలువ 0.58 శాతం నుంచి 0.34 శాతం వరకు పెరిగింది. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ సూచీలు లాభపడితే, చైనా సూచీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో ప్రధానమైన ఫ్రాన్స్, జర్మనీ సూచీలు లాభాల్లో ముగియగా, బ్రిటన్ సూచీ మాత్రం నష్టపోయింది.