బిజినెస్

బకాయిలు చెల్లించకపోతే పాన్‌కార్డు, వంటగ్యాస్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడేవారికి (విల్‌ఫుల్ టాక్స్ డిఫాల్టర్) అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఆదాయ పన్ను (ఐటి) శాఖ ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. అలాంటివారి శాశ్వత ఖాతా సంఖ్య (పర్మినెంట్ అకౌంట్ నెంబర్ లేదా పాన్)ను నిలిపివేయాలని, వంటగ్యాస్ రాయితీ (ఎల్‌పిజి సబ్సిడీ)ని రద్దు చేయాలని ఐటి శాఖ నిర్ణయించింది. అంతేగాక ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి వారికి ఎలాంటి రుణాలు మంజూరు కాకుండా చర్యలు తీసుకోనుంది. రుణాల మంజూరు లేదా ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం లేకుండా చేస్తామని ఐటి శాఖ స్పష్టం చేసింది. కావాలనే పన్ను చెల్లింపులకు దూరంగా ఉంటున్న వ్యక్తులు, సంస్థలు పెద్ద ఎత్తున ఉంటుండటంతో వారు సక్రమంగా పన్నులు చెల్లించాలంటే పైవిధంగా చేయకతప్పదనే అభిప్రాయం ఐటి శాఖ నుంచి వ్యక్తమవుతోంది. పన్ను చెల్లించే స్థోమత, సామర్థ్యం ఉండి కూడా ఎగవేతలకు పాల్పడుతున్నారని పేర్కొంటోంది. అందుకే ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కొత్త చర్యలతో ముందుకు వెళ్లనున్నామని చెబుతోంది. విల్‌ఫుల్ టాక్స్ డిఫాల్టర్లు ఎవరైతే ఉన్నారో.. వారికి పాన్ కార్డులతో ప్రమేయమున్న లావాదేవీలను అనుమతించరాదని రిజిస్ట్రార్ ఆఫ్ ప్రాపర్టీస్‌కు ఐటి శాఖ ప్రతిపాదనలను పంపుతోంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. ఇక నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్న వంటగ్యాస్ రాయితీని కూడా ఆపేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలిపింది. కాగా, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ (సిఐబిఐఎల్) గణాంకాల ఆధారంగా వీలున్న చెల్లింపుల ప్రకారం డిఫాల్టర్ల ఆర్థిక లావాదేవీలపై కనే్నయాలని, తదనుగుణంగా వారి నుంచి బకాయిలు రాబట్టడం, ఆస్తుల జప్తు వంటివి చేయాలని కూడా ఐటి శాఖ ఓ నిర్ణయానికొచ్చింది. రుణాలు, క్రెడిట్ కార్డులకు సంబంధించి సంస్థలు జరిపే చెల్లింపుల వివరాలను సిఐబిఐఎల్ సేకరించి భద్రపరుస్తుంది. కాగా, నిరుడు కూడా 20 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడిన డిఫాల్టర్ల వివరాలను ‘నేమ్ అండ్ షేమ్’ పేరిట ప్రముఖ జాతీయ పత్రికల్లో ప్రచురించింది ఐటి శాఖ. వారి వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా పొందుపరిచింది. ఇప్పటిదాకా 67 సంస్థల పేర్లను ఈ విధంగా ఐటి శాఖ బహీర్గతం చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాదైతే కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ బకాయిపడిన డిఫాల్లర్ల వివరాలను వెల్లడించాలనుకుంటోంది. పన్ను ఎగవేతలు ఆందోళనకరంగా ఉన్నాయని, వాటి అడ్డుకట్టకు తాము చేపడుతున్న ఇలాంటి చర్యలు దోహదపడతాయని భావిస్తున్నామని ఓ సీనియర్ ఐటి శాఖ అధికారి అన్నారు.
సెక్షన్ 276సిసి ప్రకారం విచారణలు
మరోవైపు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయనివారి సంఖ్య నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో అలాంటి వారిపై జరిమానా విధించాలని, విచారణలు ప్రారంభించాలని కూడా అధికారులను ఐటి శాఖ ఆదేశించింది. 2013లో ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయనివారు 12.19 లక్షలుగా ఉంటే, 2014లో 22.09 లక్షలకు, 2015లో 58.95 లక్షలకు పెరిగారు. ఈ క్రమంలో ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉన్నప్పటికీ సకాలంలో చేయకపోతే వెయ్యి నుంచి 5 వేల రూపాయల వరకు జరిమానా వేయాలని అధికారులకు ఐటి శాఖ సూచించింది. కాగా, సెక్షన్ 276సిసి ప్రకారం ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయకపోతే, వాటిపై విచారణ జరిపి కేసు తీవ్రత ఆధారంగా దోషికి జరిమానాతోపాటు మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష వేసే అధికారం ఐటి శాఖకు ఉంది. మరోవైపు పెండింగ్ కేసులు 2.58 లక్షలకు చేరుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) 1.33 లక్షల కేసులను పరిష్కరించాలని ఐటి శాఖ యోచిస్తోంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని 8.47 లక్షల కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో దాదాపు సగం వరకు ముంబయి, ఢిల్లీ సర్కిళ్ల నుంచే వస్తోంది.