బిజినెస్

వాల్‌మార్ట్ చేతికి ఫ్లిప్‌కార్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్, భారత్‌లోని అతిపెద్ద ఈ-కామర్స్ ప్లేయర్ ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసింది. ఈ మేరకు జపాన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి డీల్ కుదిరిందని సాఫ్ట్ బ్యాంకు సీఈఓ మసయోషి సన్, బుధవారం బ్యాంకు త్రైమాసిక ఫలితాలను ప్రకటించే సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఈ డీల్‌పై ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్‌ల నుంచి అధికారిక ప్రకటన వెలువడనున్నది. జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు గ్రూపు కార్పొరేషన్, ఫ్లిప్‌కార్ట్‌లో 23 శాతం వాటాలు కలిగివుంది. కాగా ఈ డీల్, ప్రపంచ ఈ-కామర్స్ రంగంలో అతిపెద్దదిగా విశే్లషకులు పేర్కొంటున్నారు. దీనివల్ల ఇప్పటివరకు ఈ-కామర్స్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని నెరపుతున్న అమెజాన్‌కు, వాల్‌మార్ట్ నుంచి పెద్ద సవాలు ఎదురుకానున్నదని వారు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారత్‌లోని తన యూనిట్లకు, అమెజాన్ రూ.2600 కోట్ల మేర అదనంగా నిధులను కేటాయించడం గమనార్హం. దీంతో భారత్‌లో అమెజాన్ మొత్తం పెట్టుబడి రూ.10,750 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇకముందు ఈ-కామర్స్ యుద్ధం మరింత వేడెక్కనున్నట్టు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఫోరెస్టర్ ప్రకారం గత ఏడాది భారత్‌లో ఈ-కామర్స్ 21 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకుంది. ఇంటర్నెట్ ఉపయోగించే ప్రజల సంఖ్య మరింత పెరుగుతుండటంతో, ఈ వాణిజ్యం మరింత ఊపందుకోనున్నది. మొబైల్ ఫోన్లు, టెలివిజన్ సెట్లు, జ్యూసిర్స్, షూలు, సోఫాలు, సౌందర్య సాధనాల అమ్మకాలను ఫ్లిప్‌కార్ట్ చేపడుతోంది. అమెజాన్ కూడా ఇదే స్థాయిలో వస్తువుల అమ్మకాలు నిర్వహిస్తోంది.
ఇదిలావుండగా వాల్‌మార్ట్ సీఈఒ డగ్ మెక్‌మిల్లన్ ఈ డీల్‌పై ప్రకటన జారీ చేసేందుకు బెంగళూరుకు చేరుకున్నారు. యుఎస్ రిటైల్ దిగ్గజమైన వాల్‌మార్ట్ తన వద్ద వున్న మేనేజ్‌మెంట్ నిపుణులను ఇక్కడకు తరలించినా, భారత్ మార్కెట్‌పై స్పష్టమైన అవగాహన ఉన్న ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన కీలక ఉద్యోగులను కొనసాగించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వాల్‌మార్ట్ భారత్‌లో 21 స్టోర్‌లను కలిగివుంది. 9 రాష్ట్రాల్లో ఉన్న వీటిల్లో క్యాష్ అండ్ క్యారీఆన్ రీతిలో వ్యాపారం నిర్వహిస్తోంది.