బిజినెస్

పుంజుకున్న స్వాధీనాలు, విలీనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో భారతీయ కంపెనీల స్వాధీనాలు, విలీనాల (ఎంఅండ్‌ఎలు) విలువ గతంతో పోలిస్తే 8 రెట్లు పెరిగాయి. ఇదే నెలలో నిర్వహించిన 40 లావాదేవీల విలువ 19.1 బిలియన్ యుఎస్ డాలర్లు. 2017 మార్చి తర్వాత కుదిరిన వివిధ డీల్‌లు అన్నింటికంటే ఇదే అధికమని గ్రాంట్ ధోర్న్‌టన్ నివేదిక వెల్లడించింది. నియంత్రణ వాతావరణం మరింత సరళతరం కావడం, వివిధ రంగాల ఏకికరణ కారణంగా ఏప్రిల్ నెలలో డీల్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. 2017 మార్చిలో జరిగిన 23.8 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ తర్వాత ఇదే అత్యధికమని నివేదిక స్పష్టం చేసింది. డీల్ విలువలు 788 శాతం పెరగడం గమనార్హం. దీంతో ఏడాది మొత్తం మీద జరిగిన ఎం అండ్ ఏ లవిలువ 37,672 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2017 ఏప్రిల్‌లో చోటుచేసుకున్న డీల్ విలువలతో పోల్చుకుంటే ఇవి రెట్టింపు పెరగడం గమనార్హం. వీటిల్లో రెండు బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ ఎక్కువగా ఉండగా, పది డీల్స్ మాత్రం 100 మిలియన్ యుఎస్ డాలర్లు కలిగినవి కావడం విశేషం.
మొత్తం ఎం అండ్ ఏ విలువల్లో 97 శాతం ఇవే ఉండటం గమనార్హం. 2017 ఏప్రిల్లో కేవలం ఆరు డీల్స్ మాత్రమే 100 మిలియన్ డాలర్ల విలువైనవి. ఏడాది మొత్తంమీద చూస్తే దేశంలో442 డీల్స్ జరిగాయి. వీటి మొత్తం విలువ 44 బిలియన్ డాలర్లు. ఇక డీల్ విలువ పరంగ 26 శాతం పెరగడం గమనార్హం. టెలికాం, ఎనర్జీ, బ్యాంకింగ్, ఐటీ, ఐటీఈఎస్, తయారీ రంగాల్లో డీల్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. మొత్తం డీల్స్‌లో వీటి వాటా 92 శాతం కావడం గమనార్హం. ఇక స్టార్ట్‌అప్‌లు, ఐటీ, ఐడీఈఎస్ రంగా డీల్ పరిమాణాల పరంగా 35 శాతం ఆక్రమించాయి.
టెలికాం రంగం మొత్తం డీల్ విలువలో 77 శాతం ఆక్రమించింది. ఇందులో భారతీయ ఇన్‌ఫ్రాటెల్, ఇండస్ టవర్‌లో విలీనం విలువ 14.6 బిలియన్ డాలర్లు. దీంతో చైనా బయట అత్యంత పెద్ద టవర్ కంపెనీకా రూపొందింది.