బిజినెస్

విదేశీ పెట్టుబడుల వెల్లువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ కంపెనీ రూ.1.05 కోట్లతో టేకోవర్ చేయాలన్న నిర్ణయం భారత్‌లో విదేశీపెట్టుబడుల ప్రవాహంపై సానుకూల ప్రభావం పడుతుందని, భారత్ ఆర్ధికాభివృద్ధికి దోహదపడుతుందని నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఒప్పందం భారత్ విదేశీ పెట్టుబడుల మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగిందని చెపద్పారు. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాలను కొనుగోలు చేసినట్లు వాల్‌మార్ట్ సంస్థ ప్రకటించిన విషయం విదితమే. ఈ నిర్ణయం వల్ల భారతీయ ఆన్‌లైన్ మార్కెట్‌తో అమెరికా రిటైలర్ సంస్థలకు అనుసంధానం ఏర్పడుతుందన్నారు. దీని వల్ల భారత్‌లో ఆన్‌లైన్ మార్కెట్ సైజు వచ్చే పది సంవత్సరాల్లో 200 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ పరిణామం భారత్‌లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగేందుకు దోహదపడుతుందన్నారు. భారత్‌లో చిన్న వర్తకులు తక్కువ ధరకే వస్తువులు కొనుగోలు చేసేందుకు వీలవుతుందన్నారు. కాగా ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ టేకోవర్ చేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు చెందిన స్వదేశీ జాగరణ్ మంచ్ వ్యతిరేకించింది. అడ్డదార్ల ద్వారా భారత్‌లోకి విదేశీ సంస్థలు ప్రవేశిస్తున్నాయని ఆ సంస్థ పేర్కొంది. భారత్ వాణిజ్య ప్రయోజనాలను పరిరక్షించాలని ఆ సంస్థ ప్రధాని నరేంద్రమోదీని కోరింది. వాల్‌మార్ట్ ప్రవేశం వల్ల భారత్‌లో చిన్న, మధ్య తరహా వర్తకుల సంస్థలు మార్కెట్ నుంచి అదృశ్యమవుతాయని జాగరణ్ మంచ్ పేర్కొంది. ప్రపంచంలోనే అతి పెద్ద కామర్స్ ఒప్పందంగా ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్ గుర్తింపుపొందింది. కాగా నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో 50 అటల్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఈ ల్యాబ్స్‌ను నెలకొల్పుతారు.