బిజినెస్

వేసవిలో ప్రత్యేక విమాన సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 25: విశాఖ నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం సమ్మర్ షెడ్యూల్ కింద కొత్త సర్వీసులు నడపడానికి పలు విమానయాన సంస్థలు ముందుకొచ్చాయి. కోల్‌కత్తా-విశాఖ-చెన్నై, ఢిల్లీ-విశాఖ-ముంబయి మధ్య విమానాలను త్వరలో ప్రవేశపెట్టడానికి జెట్ ఎయిర్‌వేస్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అలాగే వచ్చేనెల 16 నుంచి చెన్నై-విశాఖపట్నం-చెన్నై విమానాన్ని స్పైస్ జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ విమానాన్ని చెన్నై-అహ్మదాబాద్-చెన్నై మధ్య కూడా నిర్వహించడం వలన విశాఖతో అనుసంధానం చేస్తారు. ప్రస్తుత విశాఖ-హైదరాబాద్-ముంబయి కొత్త విమానాన్ని ఉదయ్‌పూర్‌తో, మధ్యాహ్నం నడుస్తున్న బెంగళూరు-విశాఖపట్నం-బెంగళూరు కొత్త విమానాన్ని కోయంబత్తూరుతో అనుసంధానిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని, తిరుపతిని అనుసంధానిస్తూ విశాఖపట్నం-విజయవాడ-తిరుపతి మధ్య, విశాఖపట్నం-హైదరాబాద్ విమానాన్ని హైదరాబాద్ దగ్గర నాలుగు గంటల వ్యవధితో హైదరాబాద్-దుబాయ్ విమానానికి అనుసంధానిస్తారు. ఈ మేరకు ఎయిర్ ట్రావలర్స్ అసోసియేషన్ (ఇండియా) అధ్యక్షుడు డి వరదారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా విశాఖకు గొప్ప కనెక్టివిటీతోపాటు వేసవి సెలవుల్లో ప్రయాణాలకు సౌలభ్యంగా ఉంటుందన్నారు.