బిజినెస్

క్యూ4లో పీఎన్‌బీ నష్టం రూ.13,417 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 15: బంగారు నగల వ్యాపారి నీరవ్ మోదీ, అతని సహచరులు పాల్పడిన కుంభకోణాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను ఘోరంగా దెబ్బతీసింది. వారు మోసపూరితంగా తీసుకొని చెల్లించవలసిన అప్పు మొత్తం రూ. 14,356.84 అని పీఎన్‌బీ మంగళవారం వెల్లడించింది. నీరవ్ మోదీకి చెందిన సంస్థలు పీఎన్‌బీకి చెందిన కొంతమంది ఉద్యోగులతో కుమ్మక్కయి మోసపూరితంగా ఎల్‌ఓయూలు (లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్)/ ఎఫ్‌ఎల్‌సీలు (్ఫరిన్ లెటర్ ఆఫ్ క్రెడిట్) తీసుకొని, విదేశాలలోని భారతీయ బ్యాంకులలో సొమ్ము చేసుకున్న విషయం కొన్నాళ్ల క్రితం బయటపడింది. దీంతో పీఎన్‌బీ నిరర్థక ఆస్తులు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా ఈ బ్యాంకు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ. 13,417 కోట్ల నికర నష్టాలను చవిచూసింది. పీఎన్‌బీ ఒక త్రైమాసిక కాలంలో ఇంత భారీగా నష్టాలను చవిచూడటం ఇదే మొదటిసారి. తాను జారీ చేసిన ఎల్‌ఓయూలు/ ఎఫ్‌ఎల్‌సీల కోసం 2018 మార్చి 31 నాటికి చెల్లించవలసి ఉన్న రూ. 6,586.11 కోట్లు చెల్లించినట్లు పీఎన్‌బీ స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించిన పత్రంలో వెల్లడించింది. పీఎన్‌బీ మంగళవారం తన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ ఈ వివరాలు వెల్లడించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 261.90 కోట్ల నికర లాభాలను ఆర్జించిన పీఎన్‌బీ సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి నీరవ్ మోదీ పాల్పడిన కుంభకోణం ఫలితంగా నిరర్థక ఆస్తులు పేరుకుపోయి 2017-18 నాలుగో త్రైమాసికంలో భారీ నష్టాల్లోకి కూరుకుపోయింది. దీంతో పీఎన్‌బీ షేర్ ధర మంగళవారం ఆరు శాతం పడిపోయంది.