బిజినెస్

రెండో రోజూ కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 16: కర్నాటకలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు వరుసగా రెండో రోజైన బుధవారం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. సెనె్సక్స్ బుధవారం 156.06 పాయింట్లు నష్టపోయి 35,387.88 వద్ద ముగియగా, నిఫ్టీ కూడా అదేబాటలో 60.75 పాయింట్లు నష్టపోయి 10,741.10 వద్ద ముగిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) భారీ స్కాం నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం వివి ధ ప్రభుత్వ బ్యాంకుల కార్యకలాపాలపై గట్టి నియంత్రణ విధించడంతో గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకుల షేర్లు భారీగా పతనమయ్యాయి. అదేమాదిరిగా ప్రస్తుతం క ర్ణాటకలో కాంగ్రెస్-జెడిఎస్ జట్టు కట్టడం, అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా ఏదో విధంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి యత్నాలు తీవ్రతరం చేయడంతో ఒక్కసారిగా రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఇక సియోల్‌తో జరపాల్సిన చర్చలను ఉత్తరకొరియా ఆకస్మికంగా రద్దు చేయడంతో పాటు, అమెరికాతో జరపాల్సిన చర్చలనుంచి ఉపసంహరించుకోవడం అంతర్జాతీయంగా సరికొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. ఇది ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.
ఇన్ని పరిణామాల నేపథ్యంలో బుధవారం సెనె్సక్స్ 35,452.35 కనిష్టం వద్ద ప్రారంభమై, 35,452.35, 35,543.89ల మధ్య ఊగిసలాడి చివరకు 35,241.63 వద్ద ముగిసింది. దీంతో సెనె్సక్స్ మొత్తం 156.06 పాయిట్లు నష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ కూడా 10,699.70, 10,790.45 మధ్య ఊగిసలాడి చివరకు 60.75 పాయింట్ల నష్టంతో 10,741.10 వద్ద ముగిసింది. ఇక ఏప్రిల్ నెలలో భారత వాణిజ్యలోటు 13.7 బిలియన్ యుఎస్ డాలర్లుగా నమోదైంది. ఇది కూడా మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్మకొట్టిందని బ్రోకర్లు చెప్పారు.
విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు మంగళవారం రూ.518.47 కోట్ల మేర షేర్ల అమ్మకాలు జరుపగా, దేశీయ సంస్థాపరమైన మదుపర్లు రూ.531.33 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారు.
హెయుఎల్ షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేయగా, ఐటీసీ లిమిటెడ్, విప్రో, ఎస్ బ్యాంకు, ఆసియన్ పెయింట్స్, సన్ ఫార్మాలు లాభాల్లో నడిచాయి. ఇక ఐసీఐసీఐ షేర్లు బాగా నష్టాన్ని నమోదు చేశాయి. తర్వాతి స్థానాలను ఆర్‌ఐఎల్, ఎస్‌బీఐ, హీరో మోటో కార్పొరేషన్, ఆదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాం కులు నష్టాలు చవిచూశాయి.