బిజినెస్

కొనసాగనున్న వేలం ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: సెబి సహారా రిఫండ్ అకౌంట్‌లో తాము ఆదేశించినట్లుగా రూ. 750 కోట్లను డిపాజిట్ చేయడంలో విఫలమైనందున సహారా గ్రూప్స్‌కు చెందిన ప్రైమ్ ఆంబీ వ్యాలీ ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ రంజన్ గోగాయ్ , ఎకె సిక్రీతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సంస్థకు నియమించిన లిక్విడేటర్ సుప్రీం ఆదేశాల మేరకు రూ.750 కోట్లను డిపాజిట్ చేయలేదని కోర్టుకు తెలిపారు. సహారా తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ, మే 15వ తేదీలోగా కోర్టు ఆదేశించినట్లుగా ఆంబే వ్యాలీ ఆస్తులను విక్రయించడంలో విఫలమైనట్లు చెప్పారు. ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తి రూ. 750 కోట్లను డిపాజిట్ చేయలేకపోయారన్నారు. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఏడాదది ఏప్రిల్ 19వ తేదీన సహారా గ్రూప్‌కు చెందిన ప్రైమ్ ఆంబే వ్యాలీ ఆస్తులను విక్రయించి, వచ్చిన సొమ్మును మే 15వ తేదీలోగా డిపాజిట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ నిర్దేశించిన తేదీలోగా ఆస్తుల విక్రయం జరగనిపక్షంలో ముంబాయి హైకోర్టు అధికార లిక్విడేటర్ ఈ ఆస్తుల విక్రయాన్ని, వేలాన్ని కొనసాగించాలని కోర్టు గతంలో పేర్కొంది.