బిజినెస్

బ్యాంకులకు మంచి రోజులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: బ్యాంకులకు మంచి రోజులు రాబోతున్నాయి. బ్యాంకులకు చెందిన 12 నిరర్ధక ఆస్తుల విలువకు సంబంధించిన కేసులను దివాళా ప్రక్రియ సంస్థకు ఆర్‌బిఐ అప్పగించడంతో, ఒక లక్ష కోట్ల నిధులు వెనక్కు వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. గత వారం టాటా గ్రూప్ సంస్థ భూషణ్ స్టీల్ లిమిటెడ్ సంస్థలో 72.65 శాతం వాటాలను టేకోవర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ మొత్తం రూ. 36వేల కోట్ల మేర బకాయి పడింది. 11 ఎన్‌పిఏ కేసులు కూడా పరిష్కారమైతే దాదాపు రూ. 1 లక్ష కోట్ల మేర సొమ్ము బ్యాంకులకు తిరిగి వస్తాయి. బ్యాంకింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు మార్గం వీలవుతుందని బ్యాంకింగ్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. దివాళా ప్రక్రియను పర్యవేక్షించే ఇన్‌సాల్వెన్సీ బ్యాంకరప్సీ కోడ్ (ఐబిసి) అమలులోకి వస్తే బ్యాంకులకు మంచి రోజులు వస్తాయి. గత ఏడాది బకాయిదార్ల జాబితాను ఆర్‌బిఐ సమీక్షించింది. కనీసం రూ.5వేల కోట్ల పైబడి బకాయి ఉన్న వారికి సంబంధించి 12 అకౌంట్లు ఉన్నాయి. మొత్తం నిరర్థక ఆస్తుల విలువలో ఈ బకాయిల విలువ 25 శాతం మేర ఉన్నాయి. కాగా వేదాంత రిసోర్సస్ సంస్థ ఎలక్ట్రో స్టీల్ స్టీల్స్‌ను టేకోవర్ చేసేందుకు ఎన్‌సిఎల్‌టి అనుమతి ఇచ్చింది. కాగా యుకె ఆధారిత లిబర్టీ హౌస్ పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని భూషణ పవర్ స్టీల్‌కు రుణాలు ఇచ్చిన సంస్థలకు కోల్‌కొత్తాకు చెందిన ఎన్‌సిఆర్‌టి గత నెలలో ఆదేశించింది. భూషణ్ పవర్ స్టీల్ సంస్థ దాదాపు రూ 48 వేల కోట్లను బ్యాంకులకు బకాయిపడింది. ఇందులో బామ్నిపాల్ స్టీల్ సంస్థ 72.65 శాతం మేర వాటాలను టేకోవర్ చేసింది. ఇందులో రూ. 35,200 కోట్లను రుణాలు ఇచ్చిన బ్యాంకులకు చెల్లించనున్నారు. ఎడాపెడా రుణాలు ఇచ్చి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన బ్యాంకులకు ఈ టేకోవర్ ప్రక్రియ బాగా కలిసి వస్తుందని అంచనా.