బిజినెస్

పీఎన్‌బీకి పెరుగుతున్న మొండి బకాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మొండి బకాయల భారం రోజు రోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరుకు ఈ బ్యాంకుకు పెద్ద బకాయిదారులు బకాయి ఉన్న సొమ్ము రూ.15,199.57 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి నెలల్లో ఈ బ్యాంకు రికార్డు స్థాయిలో రూ. 13,40 కోట్ల నష్టాలను చవి చూసింది. ఈ వివరాలను పంజాబ్ నేషనల్ బ్యాంకు విడుదల చేసింది. ఈ బ్యాం కుకు కనీసం రూ.25 లక్షల మేర బకా యి పడిన వారి పేర్లను ఉద్దేశపూర్వకంగా బకాయిపడిన వారి జాబితాలో చేర్చారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఈ బ్యాంకుకు రూ. 14,357 కోట్ల రుణాలను చెల్లించకుం డా ఎగవేశాడు. బకాయిదార్ల జాబితాలో కుడోస్ చెమ్ని రూ. 1301.82 కోట్లు, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ. 597.44కోట్లు, బిబిఎఫ్ ఇండస్ట్రీస్ రూ. 100.99 కోట్లు, ఐసిఎస్‌ఏ ( ఇం డియా) రూ. 134.76 కోట్లు , అరవిం ద్ రెమిడీస్ రూ. 158.16 కోట్లు, ఇం దూ ప్రాజెక్ట్సు రూ. 102.83 కోట్లు, జాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ లి మిటెడ్ రూ. 410.96 కోట్లు, విఎంసి సిస్టమ్స్ రూ. 296.08 కోట్లు, ఎంబిఎస్ జువెలర్స్ రూ. 266.17 కోట్లు ఉ న్నారు. కన్సార్టియంలో భాగంగా ఈ సంస్థలు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారు. సొం తంగా రుణాలు తీసుకుని బకాయిపడిన వారిలో విన్ సమ్ డైమండ్స్ జువెలరీ రూ. 899.70 కోట్లు, జూమ్ డెవలపర్స్ రూ. 410.18 కోట్లు, ఫారెవర్ ప్రీషియస్ జువెలరీ డైమండ్స్ రూ. 747.98 కోట్లు, సూర్య వినాయక్ ఇం డస్ట్రీస్ రూ. 133.96 కోట్లు, నేఫెడ్ సంస్థ రూ. 224.24 కోట్లు, మహూ మీడియా రూ. 104.86 కోట్లు ఉన్నా రు. ఏడాది క్రితం రూ. 4910.39 కోట్ల మేర నష్టాల్లో ఉన్న ఈ బ్యాంకు, నీర వ్ మోదీ నిర్వాకం వల్ల నష్టాలు రూ. 16,202.82 కోట్లకు ఎగబాకాయి. 2016-17లో రూ. 1327.80 కోట్ల లా భాలను సాధించిన ఈ బ్యాంకు ఈ ఏడాది ఆర్థిక సం వత్సరంలో నషాల్లో కూరుకుపోయిం ది. 2016-17లో నిరర్థక ఆస్తుల విలు వ 7.81 శాతం ఉండగా, 2017-18లో 11.24 శాతానికి పెరిగాయి. నిరర్ధక ఆస్తుల విలువ రూ. 32,702 కోట్ల నుంచి రూ. 48,684.29 కోట్లు పెరిగింది.