బిజినెస్

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వాన్ని కోరాయి. ఈవిధంగా అడ్డూ అదుపూ లేకుండా పెరిగే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు దేశాభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొని రావడమే ఈ పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయడానికి పరిష్కార మార్గమని ఎఫ్‌ఐసీసీఐ, అసోచామ్‌లు స్పష్టం చేశాయి. దీనికి తోడు ఎప్పటికప్పుడు బలహీన పడుతున్న రూపాయి వల్ల ముడిచమురు బిల్లు అపరిమితంగా పెరిగి, ద్రవ్యోల్బణంపై విపరీత ప్రభావం చూపుతుందని పేర్కొన్నాయి. ‘అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక సమస్యలు, అధిక వాణిజ్య లోటు వంటివి చెల్లింపులపై తీవ్ర వత్తిడిని కలిగించి ప్రతికూల పరిణామాలకు కారణమవుతాయి,’ అని ఎఫ్‌ఐసీసీఐ అధ్యక్షుడు రాశేష్ షా పేర్కొన్నారు.
చమురు ధరలు పెరగడం వల్ల రూపాయి బలహీనపడి, దిగుబతి బిల్లులు పెరగడం, ద్రవ్య విధానం మరింత కఠినతరం కావడం వెరసి ప్రైవేటు పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని’ ఆయన అన్నారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే అభివృద్ధికి మరింత ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఇందుకు ప్రభుత్వం తక్షణమే చేయాల్సిన పని పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొని రావడం కోసం కేంద్రం..రాష్ట్రాలతో కలిసి కృషి చేయాలన్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపువల్ల ఫలితం తాత్కాలికమే. జీఎస్టీ పరిధిలోకి తీసుకొని రావడమే శాశ్వత పరిష్కారమని అసోచామ్ సెక్రెటరీ జనరల్ డి.ఎస్. రావత్ అన్నారు. అంతేకాదు రానున్న కాలంలో ప్రభుత్వం ఇంధన భద్రతపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.
అంతేకాదు పెట్రోల్, డీజిల్‌లు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా కాకుండా, ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా ఉండాలని అసోచామ్ పేర్కొంది. ఇదిలావుండగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు బ్యారల్ ధర గత వారం 80 డాలర్లు పలుకగా, ప్రస్తుతం 78.87 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై 50 బిలియన్ డాలర్ల మేర భారం పడుతుందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తానన్న హామీని ఇవ్వకపోవడం గమనార్హం.