బిజినెస్

వీసా విధానం మార్చిన యూఏఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 21: పదేళ్ల కాలం వరకు రెసిడెన్సీ వీసాలను జారీ చేస్తున్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ మదుపర్లు, ‘అద్భుతమైన ప్రతిభను’ కనబరచే విద్యార్థులు, నిపుణులకు వీటిని జారీ చేయనున్నట్టు యుఏఈ మంత్రి మండలి స్పష్టం చేసింది. అమెరికా ఇటీవల అనుసరిస్తున్న మార్గంలోనే యుఏఈ కూడా పయనిస్తున్నట్టు దీన్నిబట్టి తేలుతోంది. యుఎఈ పాలకుడు, ఉపాధ్యక్షుడు, ప్రీమియర్ అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్‌టౌమ్ నేతృత్వంలో ఆదివారం సమావేశమైన అత్యున్నత స్థాయి మంత్రిమండలి సమావేశం కొత్త వీసా విధానాన్ని ప్రకటించింది. విదేశీ పెట్టుబడిదార్లను, ప్రతిభావంతులైన నిపుణులను ఆహ్వానించడమే దీని ముఖ్యోద్దేశమని డబ్ల్యుఏఎం వార్తా సంస్థ వెల్లడించింది. ‘మా దేశంలోని పారదర్శక వాతావరణం, సహనశీల విలువలు, వౌలిక వసతులు, సరళమైన పాలనా విధానాలు విదేశీ పెట్టుబడిదార్లను, ప్రతిభావంతులను ఆకర్షిస్తాయని ప్రధాని అన్నారు. ఈ తీర్మానం అమలు తీరు, తదనంతర పరిణమాల వివరాలను సంబంధిత భాగస్వాములతో కలిసి అధ్యయనం చేసి ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి తమకు పూర్తి వివరాలను సమర్పించాలని ఆర్థిక మంత్రిత్వశాఖను మంత్రి మండలి ఆదేశించింది. ఈ కొత్త విధానం పెట్టుబడిదార్లను, పోటీతత్వాన్ని పెంచి దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని డబ్ల్యుఏఎం వార్తా సంస్థ వెల్లడించింది. యుఏఈలో విద్యనభ్యసించే విద్యార్థులకు ఐదేళ్ల వీసాను మంజూరు చేస్తారు. ఇదే సమయంలో ప్రతిభావంతులకు పదేళ్ళ రెసిడెన్స్ వీసాను ప్రభుత్వం జారీ చేస్తుంది.