బిజినెస్

మార్కెట్లను వెంటాడుతున్న ‘కర్నాటక’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి ప్రభావం వరుసగా ఐదోరోజూ మార్కెట్లపై పడింది. ఫలితంగా దేశీయ మార్కెట్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని చివరకు నష్టాల్లో ముగిసాయి. సోమవారం సెనె్సక్స్ 232 పాయింట్లు నష్టపోయి, 34,616.13 వద్ద ముగియగా, నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయి 10,516.70 వద్ద ముగిసింది. శనివారం కర్నాటక శాసనసభలో బలపరీక్షకు ముందే యెడ్యూరప్ప రాజీనామా చేయడం, జేడీఎస్-కాంగ్రెస్ అలయెన్స్ ప్రకటించడం కొంతమేర మార్కెట్లపై ప్రభావం చూపింది. ఇదే సమయంలో పెరిగిన చమురు ధరలు, విదేశీ నిధులు తరలిపోవడం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు బ్రోకర్లు తెలిపారు. వీటికితోడు మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంకు రేటింగ్‌ను తగ్గించడం మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. ఇటీవల బ్యాంకులో చోటుచేసుకున్న అతిపెద్ద స్కాం, అంతర్గత నియంత్రణ బలహీనతను బట్టబయలు చేసింది. ప్రారంభంలో సెనె్సక్స్ బలంగా, పురోగామి దిశలో పయనించి ఒక దశలో 34,973.95ను చేరుకుంది. కానీ తర్వాత ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకోవడంతో34,593.82కు పడిపోయింది. చివరకు 232.17 పాయింట్లు నష్టపోయి గత నెలరోజుల కనిష్టం 34,616.13 వద్ద ముగిసింది. గత ఏప్రిల్ 25 నుంచి నమోదైన అతికనిష్ట ముగింపు ఇది కావడం గమనార్హం. గత ఐదురోజుల కాలంలో సెనె్సక్స్ మొత్తం 940.58 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ కూడా ఇదేబాటలో పయనించింది. సోమవారం 10,621.70 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 10,505.80 కనిష్టానికి చేరి తిరిగి స్వల్పంగా కోలుకొని 79.90 పాయింట్ల నష్టంతో 10,516.70 వద్ద ముగిసింది. శుక్రవారం విదేశీ పోర్టుపోలియో మదుపర్లు మొత్తం రూ.166.15 కోట్ల విలువైన షేర్ల అమ్మకాలు జరుపగా, దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.149.58 కోట్ల మేర కొనుగోళ్లు జరిపారు.
ఎస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్ర బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యంకులు షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సన్‌ఫార్మా షేర్లు అత్యధిక నష్టాన్ని నమోదు చేశాయి. డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, హీరో మోటో కార్పొరేషన్, టాటా స్టీల్, బజాజ్ ఆటో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, హెచ్‌యుఎల్, విప్రో, ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎం, మారుతి సుజికీ, ఆదానీ పోర్ట్స్, ఆసియా పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎల్ అండ్ టీ, ఆర్‌ఐఎల్, ఇన్ఫోసిస్‌లు నష్టాలు చవిచూశాయి. కాగా ఎస్‌బీఐ అత్యధిక లాభాన్ని నమోదు చేయగా, టీసీఎస్, కోల్ ఇండియా, ఐసీసీఐ బ్యాంకు, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్‌లు లాభాల బాటలో పయనించాయి.